రొయ్యల పులుసు తిని.. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్ కాదా.? : సీఎం రేవంత్ రెడ్డి

రొయ్యల పులుసు తిని.. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్ కాదా.? : సీఎం రేవంత్ రెడ్డి

నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ అని.. ఆయన హయాంలోనే కృష్ణా నీళ్లు ఏపీకి దోచిపెట్టాడంటూ అసెంబ్లీలోని నిండు సభలో ఏకిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాయలసీమ వెళ్లి అప్పటి వైసీపీ ఏపీ మంత్రి రోజా ఇంట్లో చేపలు, రొయ్యల పులుపు తిని.. ఏఉపీకి నీళ్లు అప్పగించారని.. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతి రోజూ 10 టీఎంసీల నీళ్లు దోచుకెళ్లారని.. ఇది నిజం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తప్పయితే సభలోనే క్షమాపణ చెప్పటానికి సిద్ధం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేశారు రేవంత్ రెడ్డి.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ బలగాలు వస్తే ఏం చేశారని నిలదీసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కొడుతుంటూ చూస్తూ కూర్చున్నాడని.. నీళ్లపై ఏపీ దుర్మార్గాలను చూస్తూ ఉన్నాడంటూ కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్ రెడ్డి. 

Also Read : కేసీఆర్ సభకు వచ్చినప్పుడే.. కృష్ణా జలాలపై చర్చిద్దాం

ఒక్క రోజు చేపల పులుపు తిన్నందుకే అంత విశ్వాసం చూపించిన కేసీఆర్.. పదేళ్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఏం చేశాడని నిలదీశారు సీఎం.. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ కు వెళ్లి.. పాలమూరునే ఎండబెట్టాడని.. కల్వకుర్తిని ఎడారిగా మారిందని.. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎక్కడికక్కడ వదిలేసిన కేసీఆర్ ను ఎప్పటికీ పాలమూరు క్షమించరన్నారు. జూరాల నుంచే నీళ్లు తీసుకుని ఉంటే.. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో ఇంత అన్యాయం జరిగేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్.. కాంట్రాక్టర్ల కమీషన్లకు కక్కుర్తి పడకపోయి ఉండినట్లయితే.. జూరాల నుంచే ఐదు, ఆరు టీఎంసీలు తీసుకుని ఉన్నట్లయితే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. రాయలసీమనే కాదు.. ఏపీలో ఎవరు ఉన్నా.. ఇప్పుడు నీళ్ల కోసం తెలంగాణ ముందు మోకరిల్లేవాళ్లన్నారు సీఎం రేవంత్ రెడ్డి.