
తెలంగాణకు జాతిపిత తాగుబోతోడు అయితడా.. త్యాగాలు చేసినోళ్లు అయితరా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జాతిపిత అంటే స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసి, ఆశ్రమాల్లో ఉన్న వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయన నిరాడంబరంగా ఉన్నారు.. ఈయన ఉంటారా అని ప్రశ్నించారు. ఆ జాతిపిత ఎక్కడ.. ఈ జాతిపిత ఎక్కడ.. అని ప్రశ్నించారు. కేసీఆర్ జాతిపిత అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంటుందని అన్నారు.
ఇవాళ (మార్చి 16) స్టేషన్ ఘన్ పూర్ లో రూ.800 కోట్ల పనులను ప్రారంభించారు సీఎం. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జాతిపిత అంశంపై మాట్లాడారు. జాతి పిత అంటే కొండా లక్షణ్ బాపూజీనో.. ప్రొ.జయశంకర్ సారో జాతిపిత అవుతారు గానీ.. అబద్ధాలు చెప్పేటోడు.. టీవీలు, పేపర్లు పెట్టుకుని.. లక్షల కోట్లు దోచినోళ్లు జాతిపిత ఎట్ల అవుతారని ప్రశ్నించారు.
Also Read:-పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల ఇళ్లు ఇవ్వలేదు..