ఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్

ఇంత టాలెంటెడ్ ఐడియానా : దావోస్ పెట్టుబడులపై.. కేసీఆర్, కేటీఆర్ కడపు మంటతో హోర్డింగ్స్

హైదరాబాద్ హైటెక్ సిటీ, గచ్చిబౌలితోపాటు ఐటీ సెక్టార్ ఏరియాలో ఇప్పుడు కొత్త హోర్డింగ్స్ వెలిశాయి. ఈ హోర్డింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యంగా చూడటమే కాదు.. అవాక్కయ్యేలా చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్, కేటీఆర్ కడుపు మంటను.. ఈనోతో లింక్ చేసి వెలిసిన బ్యానర్లు ఆసక్తిగా ఉన్నాయి. దావోస్ ఆర్థిక సదస్సులో.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం.. తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా ఒక లక్షా 78 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నది. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీలతో భారీ ఒప్పందాలు చేసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ పెట్టుబడులను చూసి.. బీఆర్ఎస్ నేతల కడుపు రగలిపోతుందని.. కడుపు మంటతో ఏదేదో మాట్లాడుతున్నారని.. వాళ్లను ఈనో తాగించాలంటూ ఈ హోర్డింగ్స్ సారాంశం..

హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలో వెలిసిన ఈ హోర్డింగ్స్, బ్యానర్లు చూసి పబ్లిక్ కూడా స్పందిస్తున్నారు. నిజమే కదా.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో దావోస్ వేదికగా ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదు కదా అంటూ చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి చేసి చూపించారు.. రికార్డ్ స్థాయిలో లక్షా 78 వేల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకొచ్చారనే చర్చ జరుగుతుంది. 

బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్.. పెట్టుబడులు చూసి కడుపు మంటా.. వాడండి ఈనో.. ఈనో ఆన్.. కడుపు మంట గాన్ అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో వెలిసి హోర్డింగ్స్ అందర్నీ నవ్విస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రచారం.. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు పెట్టుబడులు వచ్చిన విషయం.. ఇటు రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టినట్లయ్యిందంటున్నారు జనం.