సీఎం రేవంత్​కు ఘన స్వాగతం

సీఎం రేవంత్​కు ఘన స్వాగతం

శంషాబాద్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ఆయన దావోస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన సోదరుడు

నల్గొండ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తదితరులు సీఎంకు శాలువ కప్పి బొకే అందించి, ఘన స్వాగతం పలికారు. సీఎం కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం నేరుగా జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు.