
తెలంగాణ ప్రతిష్టను దిగజార్చాలని ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని.. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు, అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రం దివాలా తీస్తేనే వారికి సంతోషం. రాష్ట్రం కుప్పకూలాలని, తప్పుడు ప్రచారం చేసి ప్రతిష్టను మసకబార్చాలని చూస్తున్నరు.. తద్వారా పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నరు” అని మండిపడ్డారు. ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం
చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావని తెలిపారు.
బిల్లిరావు నుంచి గత సర్కార్ఆ భూమిని ఎందుకు తేలే
గచ్చిబౌలిలో భూమిని ఏం చేయొద్దని అంటున్నారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘‘25 ఏండ్ల కింద బిల్లిరావు అనే ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. 2006లో ఆ కేటాయింపును నాటి ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2023 వరకు గత ప్రభుత్వం బిల్లిరావు నుంచి గుంజుకోలేదు. నేను వచ్చాక సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. ఒక ఫేక్ కంపెనీకి భూములు కేటాయించారని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి భూమిని వెనక్కి తీసుకున్నం. అభివృద్ధిలో భాగంగా ఆ భూమిని టీజీఐఐసీకి కేటాయించి.. ఐటీ, ఇతర పరిశ్రమలు వచ్చేలా లే అవుట్ చేయాలని ప్రపోజల్స్తో ముందుకు వచ్చినం. అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్లు.. జింకలు, పులులు, సింహాలు ఉన్నట్లు మాట్లాడ్తున్నరు. కానీ, చుట్టుముట్టుతా అక్కడ కొన్ని గుంట నక్కలు చేరి.. ఇట్ల వ్యవహరిస్తున్నయ్. గుంట నక్కలకు గుణపాఠం చెప్తం. అది 100 శాతం డెవలప్డ్ ఏరియా. దానిని డెవలప్మెంట్ కోసం వాడుకుంటాం. మేం ఎవడికో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు. ఓపెన్ ఆక్షన్ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చేలా టీజీఐఐసీ నుంచి ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుంటే అడ్డుకుంటున్నరు.
ALSO READ | స్కిల్స్ లేకపోవడం వల్లే.. ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం లేదు: సీఎం రేవంత్
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు.. బిల్లిరావు దగ్గర భూమి ఉంటే వాళ్లకు(బీఆర్ఎస్) బాధలేదు.. వెనక్కి తీసుకోలేదు. ఇప్పుడు పరోక్షంగా యూనివర్సిటీ పిల్లలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. రేపు రోడ్ల కోసం, పరిశ్రమల కోసం భూములు సేకరించరా? రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు రావొద్దా ? చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇవ్వొద్దా?” అని ప్రశ్నించారు. అభివృద్ధికి సంబంధించి భూసేకరణ విషయంలో అభ్యంతరం పెట్టొద్దన్నారు. ‘‘పరిహారం ఇద్దామా ఎంత ఇద్దామో చెప్పండి. చర్చకు సిద్ధం. మూసీ పరివాహక ప్రాంతంలో నష్టపోతున్నవాళ్లకు ఏం ఇద్దాం? చెప్పండి. మల్లన్నసాగర్ పై కేసులు వేసినాయన తిరిగి వాళ్లదాంట్లోనే(బీఆర్ఎస్లో) తేలిండు. పాలమూరు రంగారెడ్డి కేసు వేసినాయన కూడా అట్లనే తేలింది” అని ఆయన తెలిపారు.