![ఢిల్లీలో సీఎం రేవంత్.. కులగణన, రిజర్వేషన్లపై చర్చ.!](https://static.v6velugu.com/uploads/2025/02/cm-revanth-reddy-delhi-tour-likely-to-meet-rahul-and-kharge_oWqVB6LRh3.jpg)
సీఎం రేవంత్ రెడ్డి డిల్లీలో( ఫిబ్రవరి 15న) బిజిబిజీగా గడపనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన పెండ్లి వేడుకకు హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే పార్టీ అగ్రనేతలు,రాహుల్, మల్లికార్జున్ ఖర్గే,కేసీ వేణుగోపాల్ ను కలవనున్నట్లు సమాచారం.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా త్వరలో రూపొందించనున్న చట్టం గురించి హైకమాండ్ కు నివేదించే అవకాశం ఉంది. కుల గణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే చేయించనున్న విషయం తెలపనున్నారు.
వీటితో పాటు పీసీసీ కార్యవర్గ విస్తరణ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, ఇతర అంశాలపై చర్చించే చాన్స్ ఉంది.అలాగే కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ తెలంగాణ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు శుభాకాంక్షలు తెలపనున్నారు రేవంత్.