ఇవాళ ( మార్చి 13 ) ఢిల్లీలో సీఎం బిజీ బిజీ...

ఇవాళ ( మార్చి 13 ) ఢిల్లీలో సీఎం బిజీ బిజీ...

హైదరాబాద్ , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై చర్చించేందుకే సీఎం ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

ఆయా దేశాల విదేశాంగశాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం కేంద్రమంత్రి  జైశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. పార్టీ పెద్దలను కూడా కలిసి మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉంది.