మూసీ రివర్​ఫ్రంట్‌కు రూ.10 వేల కోట్లు కోరిన సీఎం రేవంత్​రెడ్డి

మూసీ రివర్​ఫ్రంట్‌కు రూ.10 వేల కోట్లు కోరిన సీఎం రేవంత్​రెడ్డి
  • మూసీ క్లీనింగ్​కు రూ. 4 వేల కోట్లు..
  • ఉస్మాన్ సాగర్‌‌, హిమాయ‌‌త్ సాగ‌‌ర్‌‌ను గోదావరి జలాలతో నింపేందుకు 6 వేల కోట్లు
  • జాతీయ న‌‌ది ప‌‌రిర‌‌క్షణ ప్రణాళిక కింద కేటాయించండి
  • జల్ జీవన్ మిషన్ నిధులు విడుదల చేయండి 
  • ఓఎంసీలకు ముందే గ్యాస్ సబ్సిడీ చెల్లించే అవకాశం కల్పించండి
  • పౌర‌‌స‌‌ర‌‌ఫ‌‌రాల శాఖ బ‌‌కాయిలు రిలీజ్​ చేయాలని రిక్వెస్ట్​
  • ఢిల్లీలో కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, హర్దీప్​సింగ్​ పురి, ప్రహ్లాద్​ జోషితో భేటీ
  • సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివ‌‌ర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​కు జాతీయ న‌‌ది ప‌‌రిర‌‌క్షణ ప్రణాళిక కింద రూ.10 వేల కోట్లు కేటాయించాల‌‌ని కేంద్రానికి సీఎం రేవంత్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైద‌‌రాబాద్​లో 55 కిలోమీట‌‌ర్ల మేర ప్రవ‌‌హిస్తున్న మూసీ న‌‌దిని దేశంలో మ‌‌రెక్కడా లేని విధంగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని వివ‌‌రించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు బిజీబిజీగా గడిపారు. సోమవారం కేంద్ర మంత్రులు సీఆర్​పాటిల్, హర్దీప్​సింగ్ ​పురి, ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు.

సీఎం వెంట డిప్యూటీ సీఎం భ‌‌ట్టి విక్రమార్క,  మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి, ఖ‌‌మ్మం ఎంపీ ర‌‌ఘురామిరెడ్డి, రాజ్యస‌‌భ స‌‌భ్యుడు అనిల్ కుమార్ యాద‌‌వ్‌‌, సీఎం కార్యద‌‌ర్శి చంద్రశేఖ‌‌ర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ భ‌‌వ‌‌న్ రెసిడెంట్ క‌‌మిష‌‌న‌‌ర్ గౌర‌‌వ్ ఉప్పల్ ఉన్నారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. హైద‌‌రాబాద్ న‌‌గ‌‌రంలోని మురికి నీరంతా మూసీలోకి చేరుతున్నదని, దానిని శుద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక‌‌ల్పించింద‌‌ని జ‌‌లశ‌‌క్తి మంత్రి సీఆర్​ పాటిల్‌‌కు రేవంత్ తెలిపారు.

మూసీలో చేరే మురికి నీటిని క్లీన్​ చేయడంతోపాటు వ‌‌ర‌‌ద నీటి కాల్వల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుంద‌‌రీక‌‌ర‌‌ణ‌‌కు సహకరించాలని కోరారు. జాతీయ న‌‌ది ప‌‌రిర‌‌క్షణ ప్రణాళిక కింద దక్కన్ పీఠభూమిలోని నదుల పరిరక్షణ, అభివృద్ధికి కేంద్రం యోచిస్తున్నందున మూసీ డెవలప్​మెంట్ కు​ రూ.4 వేల కోట్లు కేటాయించాల‌‌ని కోరారు. 

ఉస్మాన్​సాగర్‌‌‌‌, హిమాయ‌‌‌‌త్ సాగ‌‌‌‌ర్‌‌‌‌ ను గోదావరి జలాలతో నింపేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు కేటాయించాల‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు చెరువుల‌‌‌‌ను గోదావ‌‌‌‌రి నీటితో నింపితే హైద‌‌‌‌రాబాద్ నీటి ఇబ్బందులు తీర‌‌‌‌డంతోపాటు మూసీ న‌‌‌‌ది పున‌‌‌‌రుజ్జీవ‌‌‌‌నానికి తోడ్పడుతుంద‌‌‌‌ని వివరించారు.

నల్లా కనెక్షన్లకు రూ.16,100 కోట్లు అవసరం 

జ‌‌‌‌ల్​జీవ‌‌‌‌న్ మిష‌‌‌‌న్ కింద తెలంగాణ‌‌‌‌కు నిధులు విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని సీఆర్​ పాటిల్‌‌‌‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. 2019 లెక్కల ప్రకారం జ‌‌‌‌ల్‌‌‌‌జీవ‌‌‌‌న్ మిష‌‌‌‌న్ కింద రాష్ట్రంలో 77.60 శాతం ఇండ్లకు న‌‌‌‌ల్లా నీరు అందుతున్నదని, ఇటీవ‌‌‌‌ల తాము చేప‌‌‌‌ట్టిన స‌‌‌‌ర్వేలో 7.85 ల‌‌‌‌క్షల ఇండ్లకు న‌‌‌‌ల్లా క‌‌‌‌నెక్షన్ లేద‌‌‌‌ని తేలింద‌‌‌‌ని చెప్పారు. ఆ ఇండ్లతోపాటు పీఎంఏవై (అర్బన్‌‌‌‌), పీఎంఏవై (రూర‌‌‌‌ల్‌‌‌‌) కింద చేప‌‌‌‌ట్టే ఇండ్లకు న‌‌‌‌ల్లా క‌‌‌‌నెక్షన్లు ఇవ్వాల్సి ఉంద‌‌‌‌ని, ఇందుకు మొత్తంగా రూ.16,100 కోట్లు అవ‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌మ‌‌‌‌వుతాయ‌‌‌‌ని వివరించారు. 2019లో జ‌‌‌‌ల్‌‌‌‌జీవ‌‌‌‌న్ మిష‌‌‌‌న్ ప్రారంభించినా నేటి వ‌‌‌‌ర‌‌‌‌కు రాష్ట్రానికి నిధులు ఇవ్వలేద‌‌‌‌ని, ఈ ఏడాది నుంచి విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని కోరారు.

కంపెనీలకు గ్యాస్​ సబ్సిడీ చెల్లించే సదుపాయం కల్పించండి

తెలంగాణ‌‌‌‌లో రూ.500కే గ్యాస్ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాకు సంబంధించిన స‌‌‌‌బ్సిడీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల‌‌‌‌ (ఓఎంసీ)కు చెల్లించే స‌‌‌‌దుపాయాన్ని క‌‌‌‌ల్పించాల‌‌‌‌ని పెట్రోలియం, స‌‌‌‌హ‌‌‌‌జ వాయువుల శాఖ మంత్రి హ‌‌‌‌ర్‌‌‌‌దీప్ సింగ్​పురికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌‌‌‌లోని కేంద్ర మంత్రి చాంబర్​లో పురిని క‌‌‌‌లిశారు. ఈ సంద‌‌‌‌ర్భంగా మ‌‌‌‌హాల‌‌‌‌క్ష్మి స్కీంలో భాగంగా త‌‌‌‌మ ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండ‌‌‌‌ర్ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేస్తున్న విష‌‌‌‌యాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.

తాము ముందుగానే స‌‌‌‌బ్సిడీ చెల్లిస్తామ‌‌‌‌ని, రూ.500కే గ్యాస్ సిలిండ‌‌‌‌ర్ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేయాల‌‌‌‌ని గ్యాస్ ఏజెన్సీల‌‌‌‌ను గ‌‌‌‌తంలోనే కోరినా.. సానుకూల‌‌‌‌త వ్యక్తం కాలేద‌‌‌‌ని చెప్పారు. ప్రస్తుతం వినియోగ‌‌‌‌దారులు సిలిండ‌‌‌‌ర్‌‌‌‌కు పూర్తి డ‌‌‌‌బ్బులు చెల్లించిన త‌‌‌‌ర్వాత స‌‌‌‌బ్సిడీ అందుతుండ‌‌‌‌డంతో ఇబ్బందిక‌‌‌‌రంగా ఉంద‌‌‌‌ని వివరించారు. గ్యాస్ సిలిండ‌‌‌‌ర్లకు చెందిన స‌‌‌‌బ్సిడీని ముందుగానే ఓఎంసీల‌‌‌‌కు చెల్లించేందుకు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించాల‌‌‌‌ని, అలా వీలుకాని ప‌‌‌‌క్షంలో వినియోగ‌‌‌‌దారుల‌‌‌‌కు త‌‌‌‌మ ప్రభుత్వం చెల్లించే స‌‌‌‌బ్సిడీని 48 గంట‌‌‌‌ల్లోపు అందేలా చూడాల‌‌‌‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 

పౌర‌‌‌‌ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాల శాఖ బ‌‌‌‌కాయిలు విడుద‌‌‌‌ల చేయండి 

ధాన్యం సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌, బియ్యం స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన బ‌‌‌‌కాయిలు వెంట‌‌‌‌నే విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని కేంద్ర ఆహార, పౌర‌‌‌‌స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. 2014-–15 ఖ‌‌‌‌రీఫ్ కాలంలో అద‌‌‌‌న‌‌‌‌పు లెవీ సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు సంబంధించి రూ.1,468.94 కోట్ల రాయితీని పెండింగ్‌‌‌‌లో పెట్టార‌‌‌‌ని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ప‌‌‌‌త్రాల‌‌‌‌ను కేంద్ర ప్రభుత్వానికి స‌‌‌‌మ‌‌‌‌ర్పించామ‌‌‌‌ని వివరించారు. అందువ‌‌‌‌ల్ల బ‌‌‌‌కాయిప‌‌‌‌డిన ఆ మొత్తాన్ని విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని  కోరారు.

ప్రధాన‌‌‌‌మంత్రి గ‌‌‌‌రీబ్ క‌‌‌‌ల్యాణ్ యోజ‌‌‌‌న కింద‌‌‌‌ 2021 మే నుంచి 2022 మార్చి వ‌‌‌‌ర‌‌‌‌కు స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేసిన 89,987.730 మెట్రిక్ ట‌‌‌‌న్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వుల‌‌‌‌ను ధ్రువీక‌‌‌‌రించుకొని, అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను రిలీజ్​ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే, 2021 మే నుంచి 2022 మార్చి వ‌‌‌‌ర‌‌‌‌కు నాన్ ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బ‌‌‌‌కాయిలు రూ.79.09 కోట్లు వెంట‌‌‌‌నే విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు.