హైదరాబాద్/యాదాద్రి భువనగిరి: యాదాద్రి అని కాకుండా యాదగిరిగుట్ట అని వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు రికార్డులను మార్చాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల నాటికి విమానగోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇవాళ ఆయన వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గుట్ట టెంపుల్ బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని, దీనిపై ప్రభత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీటీడీ స్థాయిలో అధ్యయనం చేసి టెంపుల్ బోర్డును తీర్చిదిద్దాలని అన్నారు.
ALSO READ : యాక్టివ్ సీఎం కేటీఆర్.. రేవంత్, కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యిండ్రు: కేంద్ర మంత్రి బండి సంజయ్
గోశాలలో గో సంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకురావాలని, అవసరమైతే టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని సీఎం గుర్తు చేశారు. అలానే భక్తులు కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా సమగ్ర వివరాలు, ప్రతిపాదనలతో రావాలని సూచించారు.