ధరిణి పోర్టల్ కేసీఆర్ తీసుకొచ్చింది కాదని..2010లో ఒడిశాలో ఈ ధరణి తీసుకొచ్చారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి రెవెన్యూ బిల్లుపై చర్చ సందర్బంగా అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్. ఈ ధరణిలో లోపాలున్నాయని కాగ్ తేల్చిందన్నారు. అర్హత లేని కంపెనీకి ధరణిని అప్పగించారని2014లోనే కాగ్ తప్పుబట్టిందన్నారు. కాగ్ తప్పుబట్టిన ధరణిని కేసీఆర్ తెలంగాణలో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.
సత్యం రామలింగరాజుతో సంబంధం ఉన్న వ్యక్తులకు ధరణి టెండర్లు దక్కాయని ఆరోపించారు రేవంత్. క్రిమినల్ కేసులున్న కంపెనీకి ధరణి టెండర్లు అప్పగించారని విమర్శించారు. యువరాజు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులైన వ్యక్తులకు ధరణి టెండర్లు దక్కాయన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లో ధరణి ఉందన్నారు రేవంత్.
ధరణి చట్టాన్ని రిప్లేస్ చేస్తూ కొత్త చట్టం తెస్తున్నామన్నారు సీఎం రేవంత్. కొత్త చట్టం ద్వారా కోటి 52 లక్షల ఎకరాల భూముల వివరాలను భద్రపరుస్తామని చెప్పారు. ప్రతి భూ యజమాని హక్కులను కాపాడుతామన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రూల్స్ ఉల్లంఘించిందన్నారు. చర్చను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్ర చేసిందన్నారు. అమర్యాదతో స్పీకర్ పై పేపర్లు విసిరారు. ఓపిక నశించి చర్యలకు దిగాల్సి ఉన్నా స్పీకర్ ఎంతో ఓపికగా ఉన్నారని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు భూమి ఆత్మగౌరవం. భూమి కోసం సకల తెలంగాణ ప్రజలు పోరాడిన సందర్భాలున్నాయి. భూమి కోసం ఎంతో మంది యోధులు త్యాగాలు చేశారు. బీఆర్ఎస్ తెచ్చిన భూ రెవెన్యూ చట్టం లోప భూయిష్టంగా ఉందన్నారు రేవంత్.