దానం లక్ష మెజార్టీతో గెలిస్తే కేంద్రమంత్రి అయితడు : సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్‌పేటలో రోడ్ షో నిర్వహించారు సీఎం.  కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి అయిందన్నారు.  గత కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్ కు  ఓఆర్‌ఆర్‌, ఫార్మా పరిశ్రమలు వచ్చాయన్నారు. 

గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకువచ్చామని చెప్పారు.  ఇకపై అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు సీఎం. మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని.. దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో  గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని  చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.  మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోందని, రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.