
- కలెక్టర్ పి.ప్రావీణ్య
హనుమకొండ, వెలుగు: దామెర మండలం ల్యాదెల్లలోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓల్డ్ బిల్డింగ్ లో మహిళల కోసం ప్రత్యేకంగా నైపుణ్య, శిక్షణాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఈ మేరకు ల్యాదెల్లలో గురువారం కలెక్టర్ పర్యటించారు. మహిళా సంఘాల సభ్యులతో కలెక్టర్, వివిధ శాఖల అధికారులు సమావేశమయ్యారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇరిగేషన్ కు చెందిన పాత భవనాలకు రిపేర్లు చేయాలన్నారు. అక్కడ తాగునీరు, టాయిలెట్స్, లైటింగ్, పెయింటింగ్, తదితర పనులు పూర్తి చేయాలన్నారు.
వీ-హబ్, పరిశ్రమలు, ఐటీ శాఖలతో ఒప్పందం చేసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో మేన శ్రీను, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పరకాల ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఇతర శాఖల అధికారులున్నారు.
ఈజీఎస్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
జిల్లాలో ఉపాధిహామీ పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి. ప్రావీణ్య ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం ఉపాధి హామీ పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అవెన్యూ ప్లాంటేషన్ కోసం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ఉపాధి హామీలో వ్యవసాయ అనుబంధ పనులు, కూలీలకు పని దినాలు కల్పించడం పట్ల శ్రద్ధ చూపాలన్నారు.