యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు.  సీఎం రేవంత్ సతీమణి గీతతో పాటుగా కూతురు, అల్లుడు ఇతర కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు.  గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వాదం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు  యాదాద్రిని  దర్శించుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.