కిషన్రెడ్డి.. గుజరాత్కు గులాం:సీఎం రేవంత్​రెడ్డి

కిషన్రెడ్డి.. గుజరాత్కు గులాం:సీఎం రేవంత్​రెడ్డి
  • నాడు సబర్మతికి చప్పట్లు కొట్టి.. నేడు మూసీని వ్యతిరేకిస్తరా?
  • ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం ఆగదు: సీఎం రేవంత్​రెడ్డి
  • గుజరాత్​ను తలదన్నేలా తెలంగాణ మోడల్​
  • అందుకే రాష్ట్రాభివృద్ధికి కిషన్​రెడ్డి అడ్డుపడ్తున్నడు
  • మహారాష్ట్రలో షిండే, అజిత్​, చవాన్​ లెక్క ఇక్కడ ఈయన తయారైండు
  • అబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధాల పోటీ పెడ్తే ప్రధాని మోదీకే ఫస్ట్​ ప్రైజ్​
  • దేశమంతా కులగణన చేపట్టాలని డిమాండ్​
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం

హైదరాబాద్, వెలుగు:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్​రెడ్డి గుజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గులాంగా మారార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. అప్పుడు గంగా న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది ప్రక్షాళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్మతి రివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఫ్రంట్​కు చప్పట్లు కొట్టిన కిషన్​రెడ్డి.. ఇప్పుడు మూసీ పున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుజ్జీవాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘దేశంలో గుజరాత్​ మోడల్​ను తలదన్నేలా తెలంగాణ మోడల్​ మారుతున్నది. 

తెలంగాణలోని కాంగ్రెస్​ ప్రభుత్వ మోడల్​ దేశమంతా తెలిస్తే గుజరాత్​లోని బీజేపీ మోడల్​ ఫెయిలవుతుంది. అందుకే  గుజరాత్​ గులాం లెక్క కిషన్​రెడ్డి వ్యవహరిస్తూ మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడుతున్నరు. బీజేపీ నేతలు ఏం చేసినా, ఎవరు అడ్డుకున్నా మూసీ పునరుజ్జీవం పూర్తి చేస్తం” అని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్​రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. 

గుజ‌రాత్‌లోని స‌బ‌ర్మతి నది ప్రక్షాళన కోసం 50 వేల కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించారని తెలిపారు. సబర్మతి ప్రక్షాళన టైమ్​లో కిషన్​రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని, మూసీ విషయంలో మాత్రం ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని నిలదీశారు. ‘‘మ‌హారాష్ట్రకు ఏక్ నాథ్ షిండే, అజిత్ ప‌వార్  ఎలా విరోధులుగా మారారో తెలంగాణ‌లో కిష‌న్ రెడ్డి అలా త‌యారయ్యారు” అని ఆయన ఫైర్​ అయ్యారు.

అబద్ధాల పోటీలు పెడ్తే మోదీకే ఫస్ట్​ ప్రైజ్​

ఛ‌త్రప‌తి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేద్కర్‌, బాల్​ ఠాక్రే, శ‌ర‌ద్ ప‌వార్ వంటి యోధుల నేల‌ మహారాష్ట్ర అని.. అలాంటి నేలలో  ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ ప‌వార్‌, అశోక్ చ‌వాన్ వంటి విద్రోహులు త‌యార‌య్యార‌ని సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. షిండే, అజిత్​, అశోక్​ చవాన్​ గుజ‌రాత్ గులాంలుగా మారార‌ని.. మహారాష్ట్రకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా న‌యాగామ్‌, భోక‌ర్‌, నాందేడ్ ప్రచార స‌భ‌ల్లో సీఎం రేవంత్​ ప్రసంగించారు. అబ‌ద్ధాల పోటీలు పెడితే దేశంలో నంబ‌ర్ వ‌న్‌గా ప్రధాని న‌రేంద్రమోదీ నిలుస్తార‌ని ఆయన విమర్శించారు. ‘‘ఆటో డ్రైవ‌ర్‌గా ఉన్న ఏక్‌నాథ్  షిండేను మంత్రి వ‌ర‌కు బాల్​ ఠాక్రే కుటుంబం తీసుకొచ్చింది. సొంత కుమార్తెను కాద‌ని అజిత్ ప‌వార్‌ను శ‌ర‌ద్ ప‌వార్ డిప్యూటీ సీఎం చేశారు. 

అశోక్ చ‌వాన్‌, ఆయ‌న తండ్రి శంక‌ర్ రావ్​ను కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం సీఎం చేసింది. కానీ.. షిండే, అజిత్​ పవార్​, అశోక్​ చవాన్​ ఇప్పుడు విద్రోహులుగా మారి వీరుల నేల‌ను అవ‌మానాల‌పాలజేస్తున్నారు” అని మండిపడ్డారు.

కులగణన పరిశీలనకు మోదీ టీమ్​ రావాలి

తెలంగాణ‌లో త‌మ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని సీఎం రేవంత్​ తెలిపారు. మ‌హారాష్ట్రలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతుల‌కు రూ. 3 ల‌క్షల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తుందని చెప్పారు. తెలంగాణ‌లో రుణ‌మాఫీతో పాటు మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే సిలిండ‌ర్​, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని వివరించారు. 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 50 వేల మందికి ఉద్యోగాలిచ్చామ‌ని చెప్పారు. బీజేపీ, ఎన్సీపీ (అజిత్ ప‌వార్‌), శివ‌సేన (షిండే)  నాయ‌కులు చూస్తానంటే ఆ ఉద్యోగులందరినీ  హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియానికి పిలిపిస్తామ‌ని ఆయన అన్నారు. 50 వేల మందికి ఒక్కరు త‌గ్గినా తాను క్షమాప‌ణ చెప్తాన‌ని, 50 వేల మంది ఉంటే మ‌హాయుతి నాయ‌కులు క్షమాప‌ణ‌లు చెప్తారా? అని రేవంత్ రెడ్డి స‌వాల్ విసిరారు. 

డబుల్​ ఇంజిన్ ప్రభుత్వం అంటున్నార‌ని.. డ‌బుల్ ఇంజిన్ అంటే ప్రధాని, అదానీ అని విమర్శించారు. ధారావిని అదానీకి దోచిపెట్టాల‌ని ప్రధాని ప్రయ‌త్నిస్తున్నార‌ని, కానీ దాన్ని మ‌హారాష్ట్ర ప్రజ‌లు తిప్పికొడ‌తార‌ని అన్నారు. తెలంగాణ‌లో త‌మ ప్రభుత్వం కులగ‌ణ‌న చేప‌డుతున్నద‌ని.. దాన్ని ప‌రిశీలించాల‌ నుకుంటే ప్రధాని ఒక టీమ్‌ను తెలంగాణ‌కు పంపాల‌ని రేవంత్ రెడ్డి సూచించారు. 

న‌రేంద్ర మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని ఓబీసీలోకి మార్పించు కున్నార‌ని వ్యాఖ్యానించారు.  2025లో దేశ‌వ్యాప్తంగా చేప‌ట్టే జ‌నగ‌ణ‌న‌తో పాటు కులగ‌ణ‌న చేప‌ట్టాల‌ని సీఎం రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.