కాంట్రాక్టర్లకో.. జాగీర్దార్లకో.. జమీందార్లకో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు..సాధారణ రజక కుటుంబంనుంచి వచ్చివారిని, ముదిరాజ్ లకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ..రజకుడు కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అయిండు.. మక్తల్ లో ముదిరాజ్ బిడ్డకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. కేసీఆర్ ముదిరాజ్ బిడ్డలకు ఒక్క టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. అందుకే వంద అడుగులు గోతిలో బీఆర్ ఎస్ ను పాలి పెట్టారని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యానికి ముదిరాజులు నష్టపోయారన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పక్కనే కృష్ణా నది పారుతున్న ఈ ప్రాంతానికి చుక్క నీరు లేదన్నారు. 4వేల కోట్లతో మక్తల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ఈ ఫ్రాంతానికి
లక్షా 30 వేల ఎకరాలకు నీళ్లిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎంతోకాలంగా నారాయణపేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్ ప్రజలు రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ను ఆనాడు కాంగ్రెస్ కేటాయించింది.. కాంగ్రెస్ , బీజేపీ కుట్రలు చేసి ఆపాయి.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తామన్నారు.