ఆర్ఆర్ఆర్, మెట్రో, మూసీ డెవలప్మెంట్ పై సీఎం ఫోకస్ : పొంగులేటి

ఆర్ఆర్ఆర్, మెట్రో, మూసీ డెవలప్మెంట్ పై సీఎం ఫోకస్  : పొంగులేటి

 ఎన్నికల కోడ్ కారణంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంటే అందులో ఎన్నికల కోడ్ మూడు నెలలు ఉందని చెప్పారు. ఇఫ్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి పై ఫోకస్ పెడ్తామని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

 హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలమని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాని అన్నారు. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆర్ఆర్ఆర్, మెట్రో డెవలప్మెంట్, మూసి డెవలప్మెంట్ పై సీఎం ఫోకస్ చేసారని చెప్పారు. రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కంపెనీలు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. 

రెండు రోజుల్లో ఈ అంశాలపై చర్చిస్తామని తెలిపారు. పక్కరాష్ట్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందని, మన దగ్గర ఎదో జరుగుతుందని అపోహ వద్దని బిల్డర్స్ కు న్యాయమైన అన్ని అంశాల్లో సపోర్ట్ చేస్తామని చెప్పారు. పేదవాడికి మంచి చేసే పనులకు సహకరిస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారని  పాలసీల విషయంలో ప్రభుత్వం అందడండగా  ఉంటుందని వెల్లడించారు.