సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి

సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై కొంతమంది దాడి చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ డి మార్ట్ దగ్గర శ్రీకాంత్ రెడ్డిపై ఎనిమిది మంది దాడిచేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో నాయకుడు, అతని అనుచరులు శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. 

వారం రోజుల క్రితం పార్టీ మీటింగ్ లో ఇరువురికి సల్ప వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అన్నోజిగూడ డి మార్ట్ దగ్గర.. శ్రీకాంత్ రెడ్డిని అడ్డగించి దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం శ్రీకర్ హాస్పిటల్ లో శ్రీకాంత్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.