ఇవాళ(జనవరి 31) ఉస్మానియా ఆస్పత్రికి భూమి పూజ

ఇవాళ(జనవరి 31) ఉస్మానియా ఆస్పత్రికి భూమి పూజ

 

  • గోషామహల్ ​స్టేడియంలో భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ 
  • 26 ఎకరాల్లో, రెండు వేల బెడ్స్ సామర్థ్యంతో  కొత్త హాస్పిటల్
  • అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం
  • 90 డయాలసిస్,  500 బెడ్లతో ఐసీయూలు.. ఆపరేషన్ థియేటర్లు
  • అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళిక

హైదరాబాద్, వెలుగు: పదేండ్లుగా ఎదురుచూస్తున్న కొత్త ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్​కు భూమిపూజ జరగనుంది. శుక్రవారం ఉదయం 11.40 నిమిషాలకు కొత్త ఉస్మానియా హాస్పిటల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉస్మానియా హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరగనుంది. రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 26 ఎకరాల విస్తీర్ణంలో, రెండువేల బెడ్స్ సామర్థ్యంతో ఈ కొత్త హాస్పిటల్ ను నిర్మించనున్నారు. పాత హాస్పిటల్ లో లేని అధునాతన సౌకర్యాలను ఈ కొత్త హాస్పిటల్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. 90 డయాలసిస్, హిమోఫిల్ట్రేషన్​ సీఆర్ఆర్​టీ మెషిన్లు, 500 బెడ్లతో కూడిన ఐసీయూలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీ, ప్రతి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు అందుబాటులో రానున్నాయి. కిడ్నీ, లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కిన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ విభాగం అందుబాటులోకి రానుంది. ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటాయి.

కొత్త ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న సౌలత్​లు

అంశం    పాత ఉస్మానియా    కొత్త ఉస్మానియా
బెడ్స్              1168    2000
ఓపీడీ ఏరియా    30,000 ఎస్​​ఎఫ్​టీ    1.8 లక్షల ఎస్​ఎఫ్​టీ
ఓపీడీ అటెండెన్స్               2000    5000 రోజుకు
హాస్పిటల్ ఏరియా    12 లక్షల ఎస్​ఎఫ్​టీ    32 లక్షల ఎస్​ఎఫ్​టీ
డిపార్ట్మెంట్లు                22    30
ఆపరేషన్​ థియేటర్లు                13    29
మైనర్​ ఆపరేషన్​ థియేటర్లు                  4    12
ట్రాన్స్ ప్లాంట్ యూనిట్               లేదు    ఐసీయూతో కూడిన మల్టీ 
        ఆర్గాన్ ట్రాన్స్​ ప్లాంట్ థియేటర్​ 
రోబోటిక్ సర్జరీ ఎక్విప్​మెంట్​               లేదు    క్లిష్టమైన సర్జరీలకు 
        అందుబాటులోకి రానుంది 
ఆడిటోరియం               లేదు    750 కెపాసిటీ కలిగిన
        స్టేట్ ఆప్​ ఆర్ట్ ఆడిటోరియం