KTRకు కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

KTRకు కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిదానికీ ఓ విధానం అంటూ ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పని చేస్తుందని వివరిస్తూనే.. కేటీఆర్ కు కొత్త పేరు పెట్టారు.. ఇక నుంచి కేటీఆర్ కాదని.. సైకో రాం.. కేటీఆర్ పరిస్థితి.. కేటీఆర్ కే తెలియటం లేదంటూ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. 

కేటీఆర్ పక్కన పని చేసే వాళ్లకే ఆయన చేష్టలు అర్థం కావటం లేదని.. ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడంటూ విమర్శలు చేశారాయన. ఈ సందర్భంలో కేటీఆర్ ను.. ఇక నుంచి సైకో రాం అని పిలుస్తాం అని.. ఆయనకు సైకో రాం అనే పేరు కరెక్ట్ అంటూ చురకలు అంటించారు.

Also Read : అదానీ రూ.100 కోట్ల విరాళం మాకొద్దు

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మందిపై.. కొన్ని మీడియా ఛానెల్స్ పై నిషేధం విధించిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే సైకోలా మాట్లాడుతున్నాడంటూ.. కేటీఆర్ కు.. సైకో రాం కరెక్ట్ పేరు అంటూ చురకలు అంటించారు సీఎం రేవంత్ రెడ్డి.