- సీఎం, డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
ఖైరతాబాద్, వెలుగు : ఖైరతాబాద్‌లోని శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి తొలిపూజకు హాజరుకావాలని గణేశ్ఉత్సవ అడహాక్కమిటీ సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్, ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్రాజ్కుమార్ ఆధ్వర్యంలోని బృందం గురువారం జూబ్లీహిల్స్‌లోని
ఇంట్లో సీఎంను కలిసి ఇన్విటేషన్అందజేసింది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను కలిసి ఇన్విటేషన్అందజేసినట్లు అడహాక్కమిటీ సభ్యులు తెలిపారు. వారిలో కమిటీ సభ్యులు లక్ష్మణ్‌యాదవ్, జి.కృష్ణయాదవ్, అశోక్, మహేశ్‌యాదవ్, మహేందర్‌బాబు, పృథ్వీరాజ్తదితరులు పాల్గొన్నారు.