CM Revanth: గ్రూప్-1 ఎగ్జామ్స్ జరుగుతాయో.. లేదో.. తేల్చి చెప్పిన సీఎం రేవంత్

CM Revanth: గ్రూప్-1 ఎగ్జామ్స్ జరుగుతాయో.. లేదో.. తేల్చి చెప్పిన సీఎం రేవంత్

హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సోమవారం(అక్టోబర్ 21, 2024) నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్  జరుగుతాయని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సీఐడీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పోలీస్ అకాడమీ గ్రౌండ్స్లో జరిగిన తెలంగాణ పోలీస్ ఫస్ట్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిందని, ఇప్పుడు అన్ని ఉద్యోగ నియామకాలు చేశామని, చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. గత మూడు రోజుల నుంచి రాజకీయ వ్యక్తులు నిరుద్యోగులని రెచ్చగొట్టి నిరసనలు చేయిస్తున్నారని.. అశోక్ నగర్లో జరుగుతున్న ఆందోళనలపై సీఎం వ్యాఖ్యానించారు.

ALSO READ : కావాలనే రెచ్చగొడుతున్నారు: గ్రూప్-1 ఆందోళనలపై స్పందించిన CM రేవంత్

ఒక్కసారి  నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కోర్టులని ఆశ్రయించిన లాభం ఉండదని సీఎం కుండబద్ధలు కొట్టారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మిమ్మల్ని దగ్గరికి రానివ్వలేదని, ఈరోజు మీ దగ్గరికి వచ్చి నిరసన చేస్తూ.. మీ దగ్గరకి వచ్చి కొంగ జపం చేస్తున్నారని ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు.

‘ఆందోళనలు విరమించండి...అపోహలు పెట్టుకోవద్దు... జరగబోయే ఎగ్జామ్స్ బాగా రాయండి’ అని గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం పిలుపునిచ్చారు. నిరసనలు చేస్తున్న నిరుద్యోగుల మీద  పోలీస్ సిబ్బంది ఎలాంటి కేసులు పెట్టొద్దని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ సూచించారు.