రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహను కొందరు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనన్నారు. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదని, రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద అని ముఖ్యమంత్రి తెలిపారు. భూమి ఉండి, ఆ భూమికి పాసు బుక్ ఉండి, పాసు బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ విషయంలో కొందరు దొంగలు చేసే దొంగ మాటలను నమ్మొద్దని, దీనిపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులు, రైతు వేదికల్లోని రైతులను కోరారు.
రుణమాఫీకి సంబంధించి విద్యలేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేయాలని తాము బ్యాంకు అధికారులను కోరామని, అందుకు వారు అంగీకరించారని, అలా అంగీకరించినందుకు బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము చేరేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.
also read : రైతు రుణమాఫీతో దేశానికే తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్