నవంబర్ 25 ఢిల్లీకి సీఎం రేవంత్

హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీబాట పట్టనున్నారు. నవంబర్ 25న హస్తినకు వెళ్లనున్న ఆయన కాంగ్రెస్ హైకమాండ్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా డిసెంబర్ 9న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఆహ్వానించనున్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు. అలాగే డిసెంబర్ 7లోగా మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ పదవులపైనా కసరత్తు చేస్తారని తెలుస్తోంది.