![ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌రెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/02/cm-revanth-reddy-going-to-delhi_kWIoHRPVgh.jpg)
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. రేపు కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు.
కేబినేట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులతో పాటుగా లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం, డిప్యూటీ సీఎం కలిసే అవకాశం ఉంది.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని ఆధ్యాత్మిక గురువు చిన జీయర్‌స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ముచ్చింతల్లో సమతాకుంభ్ ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తప్పకుండా హాజరవుతానని సీఎం చిన జీయర్‌స్వామికి తెలిపినట్లు సమాచారం.