తెలంగాణలోనే అతి పెద్ద జాతర అయిన సమక్క సారక్కల జాతర ఫిబ్రవరి 21నుంచి 24వరకు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓ సారి నాలుగు జరిగే ఈ జాతరకు రాష్ట్ర గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ఆమె ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ టాయిలెట్స్, డ్రికింగ్ వాటర్, పుణ్య స్నానాల సౌకర్యాలు పూర్తి చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 23న గవర్నర్ తమిళి సై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనదేవతలను దర్శించుకుంటారని అన్నారు. అదే రోజు వీరితో పాటు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కూడా వచ్చే అవకాశం ఉందని మంత్రి సీతక్క తెలిపారు.