సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమిట్ : సీఎం రేవంత్ రెడ్డి

 

  • లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్​లోని హెచ్​ఐసీ సీలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించ నున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. దీనికి సంబంధించిన లోగోను శనివారం జేఎన్టీయూహెచ్​లో ఆయన ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. 

‘‘సాంకేతిక ఆవిష్కరణల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్నోవేటర్స్, థింక ర్స్​ను సిటీకి ఆహ్వానిస్తున్నం. ఆర్టీఫిషి యల్ ఇంటెలిజెన్స్ తో సమాజానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంద నేది తెలుసుకునేందుకు ఈ సమిట్ ఉపయోగపడుతుంది” అని తెలిపా రు. 

త్వరలోనే గ్లోబల్ ఏఐ సమిట్ కోసం అధికారిక వెబ్ సైట్ ప్రారంభిం చనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలి పారు. అందులో ప్రోగ్రామ్ షెడ్యూల్ తో పాటు రిజిస్ట్రేషన్ల సమాచారం, స్పీకర్ల ప్రొఫైల్స్ తదితర వివరాలు ఉంటాయన్నారు.