ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం రేవంత్ భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సభ్యులుగా.. కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ సబ్ కమిటీ సమావేశమవుతుంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి , ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్..ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .
ALSO READ | షీ టీమ్స్కు పదేళ్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..
ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై అక్టోబర్ 25 సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై అక్టోబర్ 26న జరగనున్న కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.