హైదరాబాద్: జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించారు. అందె శ్రీ రాసిన పాటను యథాతథంగా ఆమోదిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహంపై మరిన్ని సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి అపోహలు,తప్పుడు ప్రచారాలకు తావులేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్రగీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాలు మద్దతుప్రకటించాయి. సెక్రటేరియేట్ లో వామపక్షాలు సహా.. టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్ రెడ్డిసుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రగీతాన్ని, తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలపై వివరించారు. సమావేశంలో రాష్ట్రగీతానికి మద్దతుప్రకటించినట్లు తెలుస్తోంది.త్వరలో రాజముద్రతో పాటు.. తెలంగాణ తల్లివిగ్రహావిష్కరణ ఉంటుందని సీఎం చెప్పారు. సెక్రటేరియేట్ నుంచి చిక్కురామయ్యఇంటికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో చుక్కారామయ్య కీలకంగా వ్యవహరించారు. చుక్కా రామయ్య ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీఎం పరామర్శించనున్నారు.