గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం:సీఎం రేవంత్రెడ్డి

గ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం:సీఎం రేవంత్రెడ్డి

తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.స్కిల్ యూనివర్సిటీ లో పరిశ్రమలకు ఉపయోగపడే కోర్సులు పెడతామన్నారు. తద్వారా గ్రామాల్లో ఉండే యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ప్రతియేటా లక్ష మంది ఇంజనీరు బయటకు వస్తున్నారు.. ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు ఉపయోగపడేలా చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ | చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకుంటాం:సీఎం రేవంత్రెడ్డి

మరోవైపు వ్యవసాయం పురోగతి సాధించేలా చర్యలు చేపట్టాం.. అగ్రికల్చరే మా కల్చర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అన్ని ప్రభుత్వ విధాన్నమన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామన్నారు. కుటుంబంలో కొందరు వ్యవసాయం మీద ఆధారపడాలి అన్నారు. మిగతా వారు విభిన్నర రంగాల్లో  ఎదగాలి అన్నారు. పరిశ్రమలకు అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.