బీసీ బిల్లులు ఆమోదించకపోతే... కేంద్రంపై యుద్ధమే

 బీసీ బిల్లులు ఆమోదించకపోతే... కేంద్రంపై  యుద్ధమే
  •  మా డిమాండ్​పై దిగిరాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే: సీఎం రేవంత్​రెడ్డి
  • అసెంబ్లీ ఓకే చెప్పినా ఎందుకు తొక్కిపెడ్తున్నరు?
  • మేం గుజరాత్​లో సెంట్ భూమినో, రిజర్వేషన్లనో అడుగుతలే
  • మా తెలంగాణ బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్​ చేస్తున్నం
  • పెంచకపోతే బీజేపీ లీడర్లు గల్లీల్లో ఎట్ల తిరుగుతరో చూస్తం
  • రజాకార్లను, గడీల పాలనను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది
  • పరేడ్ గ్రౌండ్స్​లో 10 లక్షల మందితో బీసీలు సత్తా చాటాలి
  • ముఖ్యమంత్రిగా అండగా ఉంటానని వెల్లడి
  • ఢిల్లీలో ‘బీసీల పోరు గర్జన’ మహాధర్నాకు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: బీసీల 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్​లో ఆమోదం తెలుపకపోతే మోదీ సర్కార్ పై ధర్మ యుద్ధం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘మేం గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్ల గురించి అడగడం లేదు. మా తెలంగాణలో బీసీలకు అసెంబ్లీలో ఆమోదించుకున్న 42 శాతం రిజర్వేషన్లకు అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేస్తున్నం. 

రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. తెలంగాణ‌‌‌‌లో రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు పెంచేందుకు మోదీకి ఎందుకు ఇబ్బంది? అధికారం ఉందని అధిపత్యం చెలాయిస్తామంటే కుదరదు. నిజాం, రజాకార్లు, ఉమ్మడి పాలన, గడీల పాలనను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది’’ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బీసీ బిల్లులను కేంద్రం 40 రోజుల నుంచి ఎందుకు తొక్కి పెడ్తున్నదని నిలదీశారు. ‘‘బీసీలంతా ఏకమై త్వరలో పరేడ్ గ్రౌండ్స్ వేదికగా పదిలక్షల మందితో ధర్మ యుద్ధం చేపట్టాలి. బీసీల శక్తి ఏమిటో ప్రధాని మోదీకి చూపాలి. 

ఎట్ల రిజర్వేషన్లు అమలు కావో అప్పుడు చూద్దాం. అప్పటికీ మోదీ ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగురవేసి రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు సాధించుకుందాం” అని అన్నారు. రిజర్వేషన్ల సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీలకు అండగా ఉంటానని చెప్పారు. ‘‘ఇంకెంతో కాలం ప్రధాని మోదీ బీసీ ముసుగులో దేశాన్ని ఏలలేరు. బీసీ రిజర్వేషన్ల డిమాండ్లకు ఆయన దిగన్నా రావాలి... లేదా అధికారం నుంచి దిగన్నా పోవాలి. ఇసుమంత సాయం చేస్తే.. జీవితాంతం గుర్తు పెట్టుకునే జాతి బీసీలది. ఈ జాతికి అన్యాయం చేస్తే వాళ్లు మర్చిపోరనే విషయాన్ని మోదీ గుర్తుంచుకోవాలి” అని ఆయన అన్నారు.  

బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పార్లమెంట్​లోనూ ఆమోదించాలని డిమాండ్​ చేస్తూ.. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ లో 12 బీసీ సంఘాలు ‘బీసీల పోరు గర్జన’ మహాధర్నా నిర్వహించాయి. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

కోటా పెంపునకు ఓకే చెప్తే మోదీని సన్మానిస్తం

తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతిస్తే 10 లక్షల మందితో సభ పెట్టి ప్రధాని మోదీని సన్మానిస్తామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. లేదంటే.. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రామని, బీజేపీ నేతలు ఎలా గల్లీలోకి వస్తారో చూస్తామని హెచ్చరించారు. ‘‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు ‘అయిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ పోయి రావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లె హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు’ అని అన్నారు. ఇప్పుడు మేం ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్మం కోసం హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చాం. కురుక్షేత్రంలో ఆనాడు కృష్ణుడు సయోధ్యలో భాగంగా ఐదు గ్రామాలు ఇవ్వాలని దుర్యోధనుడిని కోరితే.. వినలేదు. అలాగే ఈ రోజు సయోధ్యలో భాగంగానే తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండీ అని హస్తినకు వచ్చి ప్రధానిని కోరుతున్నాం. ఇవ్వకపోతే ధర్మయుద్ధం తప్పదు’’ అని స్పష్టం చేశారు. ‘‘బీసీల కోసం బండి సంజయ్ ప్రాణం ఇస్తామంటున్నరు. మీ ప్రాణంతో మేం ఏం చేసుకోవాలి? మీరు, మోదీ వందేండ్లు సుభిక్షంగా ఉండాలి.  మీ ప్రాణాలు మాకొద్దు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇయ్యండి చాలు’’ అని ఆయన అన్నారు.  

ఇప్పుడు కాకపోతే.. ఎప్పుడు?

బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేస్తామని తాము ముందుకు వస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని సీఎం రేవంత్​రెడ్డి  ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న పూర్తి చేసి బీసీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 42 శాతం రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు పెంచుతూ చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బిల్లులు ఆమోదించుకున్నామని గుర్తుచేశారు.  తెలంగాణ అసెంబ్లీలో సీఎంగా తాము ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన బీసీ బిల్లులను 40 రోజులుగా తొక్కిపెట్టడానికి కారణం ఏమిటని కేంద్రాన్ని నిలదీశారు.  రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తాము రాష్ట్రంలో కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టామని,  బీసీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. ‘‘చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు రావాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నా.. స్థానిక సంస్థల్లో రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు కొన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నా దేశవ్యాప్తంగా జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న జర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాలి. ఎప్పుడు అధికారంలోకి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చినా జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాంగ్రెస్ పార్టీ విధాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన నిర్ణయం తీసుకుంది. జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేర్చి.. దాని ఆధారంగా విద్యా, ఉద్యోగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉపాధిలో మాత్రమే కాకుండా రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీయ రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టించారు. 

నాది ఏ సామాజిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గమైనా... రాహుల్ గాంధీ మాట నిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెట్టేందుకు ప్రయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్నించాను. మేం అధికారం చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టిన వంద రోజులు తిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముందే బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల లెక్కలు తేల్చేందుకు శాస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేశాం. కుల గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న పూర్తి చేసి బీసీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 42 శాతం రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు పెంచుతూ చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో బిల్లులు పెట్టి ఆమోదించుకున్నాం’’ అని వివరించారు. 

బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలనేది ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్మబ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ధమైన కోరిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని,  ఇందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్  ముందుకు రావాలని డిమాండ్​ చేశారు.  ‘‘పార్లమెంట్ ఉభయ సభల్లో మెజార్టీ లేకపోయినా.. ట్రిపుల్ తలాక్,  సిటిజన్ అమైండ్ మెంట్ యాక్ట్, తాజాగా వక్ఫ్ బిల్లు తెచ్చారు. కానీ, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. 

కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు.. ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు.. సీపీఎం నుంచి సీపీఐ వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నా... బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధేమిటి? బీసీ రిజర్వేషన్ల పెంపునకు మద్దతుగా దాదాపు 17 పార్టీల నుంచి సుమారు 60 మంది ఎంపీలు జంతర్ మంతర్ లో బీసీల పోరు గర్జనకు సంఘీభావం తెలిపారు. 

మోదీ ఎందుకు స్పందించడం లేదు? అందరూ శాకాహారులే అయితే... రొయ్యల గంప ఎక్కడ మాయమైందన్నట్లు ఉంది కేంద్రం తీరు. బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  తెలంగాణ అసెంబ్లీ చేసిన ఏక గ్రీవ తీర్మానాననికి అనుమతించకపోతే కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాల్సిందే.. వారి గద్దెలు కూలాల్సిందే’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు రాకపోతే... ఎప్పటికీ రావని, ఇదే కరెక్ట్​ టైమ్​ అని పేర్కొన్నారు.  గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని, బీసీలంతా కలిసి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.  

సంఘీభావం తెలిపిన 17 పార్టీలు

ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద 12 బీసీ సంఘాలు చేపట్టిన ‘బీసీల పోరుగర్జన’ మహాధర్నాకు దాదాపు 17 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఆయా పార్టీలకు చెందిన 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకార్, కొండా సురేఖ, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్​కుమార్​రెడ్డి, కావ్య, సురేశ్ షెట్కర్, రేణుకా చౌదరి, రఘురాంరెడ్డి, కుమారీ షెల్జా, ప్రీతీ షిండే, అమర్ సింగ్, ప్రభా(కర్నాటక), సీనియర్​ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, వీహెచ్, టీజేఎస్​ చీఫ్​ ఎమ్మెల్సీ కోదండరాం, సినీ నటుడు సుమన్, సీపీఐ నేత నారాయణ, డీఎంకే నేతలు విల్సన్, కనిమొళి, ఎస్పీ లీడర్​ నరేష్ ఉత్తమ్ పాటిల్, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే, ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, మహారాష్ట్ర నేత గైక్వాడ్, పంజాబ్ పీసీసీ చీఫ్​ అమరన్ సింగ్ తదితరులు మహాధర్నాకు హాజరయ్యారు. 

విధానపరంగా బీజేపీ వ్యతిరేకం

బీసీల రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల పెంపుకు బీజేపీ నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు విధాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగా వ్యతిరేకమని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘నాడు ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బీసీల కోసం మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్​ను నియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మించారు. తర్వాత వీపీ సింగ్ మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్  సిఫార్సులను అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ, మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా నాడు బీజేపీ కుట్ర చేసింది.. క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ యాత్ర మొద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుపెట్టింది. ఆ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ యాత్ర ప్రతినిధే ప్రస్తుతం న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేంద్ర మోదీ. గుజరాత్, యూపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కల్పించాలని మేం కోరడం లేదు. 

గుజరాత్ లో సెంట్ భూమి కూడా కోరడం లేదు.. అక్కడ ఒక్క శాతం రిజర్వేషన్లను కూడా అడగడం లేదు. మా తెలంగాణలో మేం బీసీలకు 42 శాతం పెంచుకున్న రిజర్వేషన్లను ఆమోదించాలని డిమాండ్​ చేస్తున్నం’’  అని ఆయన స్పష్టం చేశారు.  కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టి రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ల పెంపు తీర్మానం చేసి దేశానికే తెలంగాణ ఓ దిక్సూచిగా నిలిచిందని సీఎం రేవంత్​ అన్నారు. ‘‘బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీన వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల లెక్కలు తేల్చాల్చి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే 2021లో చేయాల్సిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాభా లెక్కల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేంద్రంలోని బీజేపీ సర్కార్​ చేయడం లేదు. 

అయితే రాహుల్ గాంధీ కులగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని డిమాండ్ చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంతో 2025 వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చినా జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేయకుండా వాయిదా వేస్తున్నది. బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హీన వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలబెట్టుకున్నాం. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందే. అందుకే కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చాం. ఇందిరాగాంధీ ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదివాసీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అమ్మలా వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించి.. రిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్లు, పేదలకు ఇండ్లు ఇచ్చారు. భూస్వాముల ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్గర ఉన్న వేల ఎక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల భూములను ఎస్సీ, ఎస్టీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇచ్చారు. 

అందుకే ఇప్పటికీ ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళితులు, ఆదివాసీలు ఇండ్లలో ఇందిరమ్మ ఫొటోలు  ఉంటాయి”అని తెలిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం  అనుమతివ్వకపోతే ఈ అంశం దేశవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తుందనే విషయం మోదీ సర్కార్​ గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. ‘‘దేశ నలుమూలల్ని జాగృతం చేస్తం. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలను ఏకం చేస్తం. మీరు ఢిల్లీ గద్దెపై ఎలా ఉంటారో చూస్తం’’ అని హెచ్చరించారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో మెజార్టీ లేకపోయినా.. ట్రిపుల్ తలాక్,  సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్, తాజాగా వక్ఫ్ బిల్లు తెచ్చారు. కానీ, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఎందుకు కేంద్రం ముందుకు రావడం లేదు. కమ్యూనిస్ట్ నుంచి కాంగ్రెస్ వరకు.. ఎంఐఎం నుంచి బీఎస్పీ వరకు.. సీపీఎం నుంచి సీపీఐ వరకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నా..బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించడానికి మోదీకి వచ్చిన బాధేమిటి?  
- సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్​ఎస్​ దుర్మార్గ పాలకుడు యువకుల గోస వినలే 

తెలంగాణ ఏర్పడిన త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత ఉద్యోగాలు భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్తీ చేయాలని గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త పోరాడారని, అయినా పదేండ్ల పాలనలో కేసీఆర్​ పట్టించుకోలేదని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు.   ‘‘నాటి దుర్మార్గ పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుడు యువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త గోస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టించుకోలేదు. ఎంత కొట్లాడినా.. ఎంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణించినా.. నాటి పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుల చెవుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎక్కలేదు. పాద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాత్ర స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంలో తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఊడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గొ ట్టాలని నేను చెప్పాను. యువ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త ఆ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చేశారు. మా ప్రజా ప్రభుత్వం వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన ఏడాదిలోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చిత్తశుద్ధిని చాటు కున్నాం” అని ఆయన తెలిపారు.  తెలంగాణలో పదేండ్ల పాలనలో ఉద్యోగాలు ఇవ్వని తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఊడగొట్టి, వేలాది ఉద్యో గాలు యువత సాధించుకున్నారని..  ఇప్పుడు
42 శాతం బీసీ రిజర్వేషన్లకు అనుమతివ్వకపోతే మోదీ సర్కార్​కు బీసీ బిడ్డలు తమ సత్తా చూపిస్తారని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు.

బీసీ హక్కుల పరిరక్షణకు మా మద్దతు: కనిమొళి

42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చట్టం చేసినందుకు గర్వంగా ఉందని డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి అన్నారు. బీసీ ప్రజల గొం తును కేంద్రం వినాలని డిమాండ్ చేశా రు. ఒక్కటిగా అందరం కేంద్రంపై పోరా డుదామని పిలుపునిచ్చారు. ఇప్పటికే తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని, ఆ ఘనత కరుణానిదికే దక్కుతుందని చెప్పారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కతాటిపై వచ్చి పోరాడాలని కోరారు. 

కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం: ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ

కులగణనకు ఎంఐఎం పూర్తి మద్దతు ఇస్తున్నదని ఆ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం హర్షనీయమని పేర్కొన్నారు. అయితే, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం క్యాప్ ను తొల గించేలా రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు. ఈ అం శంపై అందరం కలిసి కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 42%  రిజర్వేషన్లు అమల్లోకి వస్తే హిందూ బీసీలతో పాటు బీసీ ‘ఈ’లో ఉన్న మైనార్టీలకూ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.