రైతు ఆత్మహత్యలు ఉండొద్దనేది ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతుల్ని రుణవిముక్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకే విడతలో రైతులకు 31 వేల కోట్లు మాఫీ చేశామని చెప్పారు. రైతుల ఆత్మహత్యలు ఉండొద్దనేదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. డ్రగ్స్ దేశాన్ని నాశనం చేస్తోందని..డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకూమారీస్ నడుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.