హోంగార్డులకు రోజుకు వెయ్యి వేతనం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: హోంగార్డులకు రోజుకు రూ. 1000 ల వేతనం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోన ఎస్డీఆర్ ఎఫ్ కొత్త వాహనాలను ప్రారంభిం చారు.  ఈసందర్భంగా హోంగార్డులకు రోజువారి వేతనం రూ. 1000, వీక్లీ పరేట్ అలవెన్స్ లు రూ. 200 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

పోలీసులతో సమానంగా హోంగార్డులు పనిచేస్తున్నారు. హోంగార్డులను అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డులకు రోజు వారీ జీతం, వీక్లీ పరేట్ అలవెన్సుల పెంపుతోపాటు ఆరోగ్యశ్రీలో మెరుగున వైద్య సేవలు అందిస్తామని అన్నారు. హోంగార్డులు ఎవరైనా ప్రమాదవ శాత్తు చనిపోతే రూ. 5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పారు. 

ALSO READ : కేటీఆర్‌.. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగమేంటో చెప్పు: టీపీసీసీ చీఫ్

రాష్ట్రంలో సైబర్ క్రైం అత్యంత వేగంగా పెరుగుతోంది.. సైబర్ క్రైం లు అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ సిటీలో గంజాయి అమ్మకం, కొనుగోలు తగ్గిందన్నారు. హైదరాబాద్ లో ఎక్కడా మాదకద్రవ్యాల పేరు వినిపించకుండా చేస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టు లు ఏర్పాటు చేస్తామన్నారు. 

పోలీసు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసు అధికారుల ప్రమాద పరిహారం ప్రకటించారు. ఐపీఎస్ అధికారి ప్రమాదవశాత్తుచనిపోతే రూ. 2 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ డీఎస్పీ స్థాయి అధికారులకు రూ. కోటిన్నర ప్రమాద పరిహారం ఇస్తామన్నారు.