ఏఐ ఫేక్ కంటెంట్‌‌పై కోర్టుకు పోదాం: సీఎం రేవంత్రెడ్డి

 ఏఐ ఫేక్ కంటెంట్‌‌పై కోర్టుకు పోదాం: సీఎం రేవంత్రెడ్డి
  • కంచ గచ్చిబౌలి భూములపై రివ్యూలో సీఎం రేవంత్
  • ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనాను మించిన మహమ్మారి
  • ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోండి
  • సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలి
  • ఫోరెన్సిక్ టూల్స్ సమకూర్చుకోవాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ఏఐ ఫేక్ కంటెంట్​పై సీఎం రేవంత్​రెడ్డి సీరియస్​ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవపట్టిస్తున్న దీనిపై కోర్టుకు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఫేక్ ఇమేజ్​లు, వీడియోలు క్రియేట్ చేశారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. 

ఏఐ ఫేక్ కంటెంట్‌‌ను పసిగట్టేందుకు అవసరమైన అత్యాధునిక​ ఫోరెన్సిక్ హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌‌వేర్ టూల్స్ సమకూర్చుకోవాలని సూచించారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సెక్రటేరియెట్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ ఫేక్ కంటెంట్‌‌పై సీఎం, మంత్రులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

హెచ్‌‌సీయూ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కొని చెట్లను నరికి, వన్యప్రాణులను చెదరగొట్టినట్టుగా ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు, ఫొటోలు సృష్టించారని.. వీటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాల్‌‌ విసిరిందన్నారు. ఇలాంటి ఫేక్​వీడియోలు ఇండో–పాక్, ఇండో–చైనా సరిహద్దుల్లో సర్క్యులేట్​ చేస్తే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం లేకపోలేదని పలువురు అధికారులు హెచ్చరించారు.

 ఏఐ ద్వారా రూపొందించే ఇలాంటి ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌‌ను మించిన మహమ్మారి లాంటివని అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీయూకు కేటాయించిన భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ, గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ లాంటి ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు నిర్మించారని పేర్కొన్నారు. కానీ ఇన్నేండ్లలో ఏనాడూ ఎలాంటి వివాదాలు రాలేదని, ఎవరూ ఆందోళనకు దిగలేదని గుర్తుచేశారు.  

కానీ అదే సర్వే నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే మాత్రం సమస్య వచ్చిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేక్​వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే ఈ వివాదం తలెత్తిందని.. జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని సీఎంకు అధికారులు వివరించారు. 

వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో చాలాదూరం వెళ్లడం వల్లే పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. నెమళ్లు ఏడుస్తున్నట్టుగా ఫేక్​ఆడియోలు, బుల్డోజర్లు తగిలి గాయాలతో జింకలు పరుగు తీస్తున్నట్టుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్​మీడియాలో వదిలారని సీఎంకు పోలీసు అధికారులు వివరించారు. 

ప్రముఖుల పోస్టులతో అబద్ధాలకు ఆజ్యం.. 

కొందరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫేక్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిజమని నమ్మి.. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని సీఎంకు అధికారులు వివరించారు. ఏకంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా టాండన్​లాంటి వాళ్లందరూ ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని చెప్పారు. 

ఈ భూములపై మొట్టమొదట ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ ఝా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియోను ప్రచారం చేశారని తెలిపారు. కాగా, అధికారులు చెప్పిందంతా విన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఈ అంశంపై కోర్టులోనే తేల్చుకోవాలని వాళ్లకు సూచించినట్టు తెలిసింది. సమావేశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.