మోదీ..హైదరాబాద్​కు రా సంక్షేమం చూపిస్త: సీఎం రేవంత్రెడ్డి

  • సెక్రటేరియెట్​లో కూర్చోబెట్టి స్కీమ్స్​పై వివరిస్త: సీఎం రేవంత్​
  • లేదంటే మీ కమిటీనైనా పంపండి
  • వాళ్ల విమాన ఖర్చులు నేనే భరిస్త
  • తెలంగాణలో గ్యారంటీలనుసక్సెస్​ఫుల్గా అమలు చేస్తున్నం
  • 11 ఏండ్ల మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు
  • ముంబైని  విద్రోహులకు అడ్డాగా మార్చారు
  • మహారాష్ట్రలో రైతుల సూసైడ్​పై మోదీ ఎందుకు మాట్లాడరని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు హైదరాబాద్​కు వస్తే సెక్రటేరియెట్​లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు కూడా చెప్తానని తెలిపారు. ‘‘లేదంటే కేంద్ర మంత్రి, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో ఒక క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిటీ వేసి తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపండి. వాళ్లకు అన్ని వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు ఇస్తం. అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైతే వారి విమాన ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చులు మేమే భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస్తం” అని సవాల్​ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పుణెలో మీడియాతో మాట్లాడారు.

 ఇచ్చిన    హామీలను నెరవేర్చడంలో మోదీ ఫెయిలయ్యారని, ఆయన పాలనలో చెప్పుకొనేందుకు  ఒక్క స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్సెస్ స్టోరీ కూడా లేదన్నారు. అలాంటి మోదీ.. తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్నాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హిమాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆరోప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ‘‘మేం 50 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణ మాఫీ చేశాం. కావాలంటే మోదీకి  ప్రతి రైతు ఖాతా వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు అందిస్తాం.  50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ స్టేడియంలో స్వయంగా నేనే ఆ నియామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్రాలు అందించా.  ఆర్టీసీ బస్సుల్లో మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కడి నుంచి ఎక్కడి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా ఉచితంగా ప్రయాణించే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్పించాం. ఇప్పటికే  కోట్లాది మంది మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉచితంగా ప్రయాణించారు” అని  వివరించారు.  

పేదలను మోదీ దోచుకున్నరు

సోనియా గాంధీ సూచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న మేర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2004 లో దీపం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం కింద రూ.400 కే గ్యాస్ సిలిండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్, స్టవ్ ను నాటి కేంద్ర ప్రభుత్వం అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేసిందని, కానీ మోదీ ప్రధాని అయిన త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత రూ.400 గ్యాస్ సిలిండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.1200 కు పెంచారని రేవంత్​ తెలిపారు. సిలిండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర పెంచి పేద మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రూపాయి, రూపాయి వంటింట్లో దాచుకున్న డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్బును మోదీ చోరీ చేశారని మండిపడ్డారు.‘‘తెలంగాణ‌‌‌‌లో పేద మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌కు రూ.500కే  సిలిండ‌‌‌‌ర్ ఇస్తున్నాం.  50 ల‌‌‌‌క్షల కుటుంబాలు రూ.500 ల సిలిండ‌‌‌‌ర్ తో లబ్ధి పొందుతున్నాయి. 

కావాలంటే ఆ వివ‌‌‌‌రాలు అందిస్తాం. రైతుల‌‌‌‌కు 24 గంట‌‌‌‌లు ఉచిత క‌‌‌‌రెంట్ స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా చేస్తున్నం. ప‌‌‌‌ట్టణాల్లో, ప‌‌‌‌ల్లెల్లో పేద‌‌‌‌ల‌‌‌‌కు 200 యూనిట్ల వ‌‌‌‌ర‌‌‌‌కు ఉచిత క‌‌‌‌రెంట్ ఇస్తున్నం. స్వాతంత్య్రం వ‌‌‌‌చ్చిన త‌‌‌‌ర్వాత ఏ రాష్ట్రంలోనూ రానంత ధాన్యం దిగుబ‌‌‌‌డి ఈ సారి తెలంగాణ‌‌‌‌లో  వ‌‌‌‌చ్చింది.  మొత్తం 1.50 ల‌‌‌‌క్షల మెట్రిక్ ట‌‌‌‌న్నుల ధాన్యం పండింది. ఎంఎస్​పీకి అద‌‌‌‌నంగా రైతుల‌‌‌‌కు ప్రతి క్వింటాకు మా ప్రభుత్వం రూ.500 బోన‌‌‌‌స్ ఇస్తున్నది” అని రేవంత్​ తెలిపారు. 

పేద‌‌‌‌ల‌‌‌‌కు కార్పొరేట్ ఆసుప‌‌‌‌త్రుల్లో వైద్యం అందించేందుకు సోనియాగాంధీ నేతృత్వంలో దేశంలోనే మొద‌‌‌‌టి సారిగా రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌‌‌‌థ‌‌‌‌కాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని, ఇప్పుడు దీని పరిమితిని తెలంగాణ‌‌‌‌లో తాము రూ.10 ల‌‌‌‌క్షల‌‌‌‌కు పెంచామని చెప్పారు. పేద‌‌‌‌ల వైద్యానికి ఇప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కూ రూ.50 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.  ‘మావి కచ్చితమైన గ్యారెంటీలు.. కానీ, మోదీవి భారతీయ జూటా పార్టీ గ్యారెంటీలు” అని ఎద్దేవా చేశారు.  ఏపీలో పార్టీ దెబ్బతింట‌‌‌‌ద‌‌‌‌ని తెలిసినా సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని  ఇచ్చారని గుర్తుచేశారు. 

మహారాష్ట్రలోనే  రైతు ఆత్మహత్యలు ఎక్కువ

మోదీలాగే మ‌‌‌‌హారాష్ట్రలోని మ‌‌‌‌హాయుతి సర్కారుకు కూడా ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదని రేవంత్​ అన్నారు.   ప్రతిసారి బాంబు పేలుళ్లు, ఇత‌‌‌‌ర కొత్త, కొత్త అంశాలను  ప్రధాని మోదీ  ఎన్నిక‌‌‌‌ల ముందు తెర‌‌‌‌పైకి తెస్తున్నారని, చెప్పుకోవ‌‌‌‌డానికి ఏంలేక‌‌‌‌నే ఇలాంటి వాటిపై ఆధార‌‌‌‌ప‌‌‌‌డుతున్నారని విమర్శించారు. ‘‘దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌‌‌‌ని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామ‌‌‌‌ని, 2022కు ముందే దేశంలోని ప్రతి పేద‌‌‌‌వాడికి ఇల్లు నిర్మిస్తామ‌‌‌‌ని 2014 ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌కు ముందు మోదీ  న‌‌‌‌రేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 

రైతుల ఆదాయం రెట్టింపు చేయ‌‌‌‌క‌‌‌‌పోగా వారికి వ్యతిరేకంగా 3 న‌‌‌‌ల్ల చ‌‌‌‌ట్టాలు తెచ్చారు. 16 నెల‌‌‌‌ల పాటు రైతులు ధ‌‌‌‌ర్నాలు, ఆందోళ‌‌‌‌న‌‌‌‌లు చేశారు. ఆ స‌‌‌‌మ‌‌‌‌యంలో 700 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు” అని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా మ‌‌‌‌హారాష్ట్రలోనే రైతులు ఆత్మహ‌‌‌‌త్యలు చేసుకుంటున్నారని, ఈ విష‌‌‌‌యంపై మాత్రం మోదీ మాట్లాడడం లేదని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాల‌‌‌‌పై లోక్‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌లో ప్రశ్నిస్తే.. కేవ‌‌‌‌లం 7.50  ల‌‌‌‌క్షల ఉద్యోగాలు ఇచ్చామ‌‌‌‌ని స‌‌‌‌మాధానం ఇచ్చారని, అంటే ప‌‌‌‌ద‌‌‌‌కొండేండ్ల పాల‌‌‌‌న‌‌‌‌లో ఒక్క శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు.

రైతులు, పేద‌‌‌‌ల సంక్షేమం, ఉద్యోగాల విష‌‌‌‌యంలో న‌‌‌‌రేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫ‌‌‌‌ల‌‌‌‌మైందని దుయ్యబట్టారు. ‘‘మోదీ ఇంతకాలం అంబానీ, అదానీ కోసం ప‌‌‌‌ని చేశారు. ఇప్పుడు అంబానీ కూడా లేరు. కేవలం ఒక్క అదానీ కోస‌‌‌‌మే మోదీ ప‌‌‌‌ని చేస్తున్నారు. అదానీకి మ‌‌‌‌హారాష్ట్రను పూర్తిగా దోచిపెట్టేందుకు ప్రధాని ప్రయ‌‌‌‌త్నిస్తున్నారు” అని విరుచుకుపడ్డారు.

మోదీకి గులాంలుగా షిండే, అజిత్​, చవాన్​

ముంబై దేశానికి ఆర్థిక రాజ‌‌‌‌ధాని అని, మ‌‌‌‌హారాష్ట్ర రాజ‌‌‌‌కీయంగా దేశంలో రెండో పెద్ద రాష్ట్రమని, అలాంటి రాష్ట్రాన్ని మోదీ కోవ‌‌‌‌ర్టు ఆప‌‌‌‌రేష‌‌‌‌న్లకు, విద్రోహులకు అడ్డాగా మార్చారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. చిన్న కార్యక‌‌‌‌ర్త షిండేను బాలాసాహెబ్ ఠాక్రే మంత్రి వ‌‌‌‌ర‌‌‌‌కు తీసుకువ‌‌‌‌స్తే..  ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా, మోదీకి గులాంగా షిండే మారారని విమర్శించారు. శ‌‌‌‌ర‌‌‌‌ద్ పవార్ సొంత బిడ్డను కాద‌‌‌‌ని సోద‌‌‌‌రుడి కుమారుడు అజిత్ ప‌‌‌‌వార్‌‌‌‌కు మంత్రి ప‌‌‌‌ద‌‌‌‌వులు ఇస్తే ఆయ‌‌‌‌న‌‌‌‌ మోదీ పంచన చేరారని అన్నారు. 

అశోక్ చ‌‌‌‌వాన్‌‌‌‌ను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చేస్తే..ఆయ‌‌‌‌న కూడా మోదీకి గులాంగా మారారని రేవంత్ దుయ్యబట్టారు. ముంబైలోని ధారావిని క‌‌‌‌బ్జా చేసేందుకు విద్రోహులైన షిండే, అజిత్ ప‌‌‌‌వార్, అశోక్ చ‌‌‌‌వాన్‌‌‌‌ను వినియోగించు కుంటున్నారని ఆరోపించారు.‘‘12 కోట్ల మ‌‌‌‌హారాష్ట్ర ప్రజలకు నేను ఒక‌‌‌‌టే విజ్ఞప్తి చేస్తున్నా.. ఇది ఎన్నిక కాదు.. ఇదో ధర్మ యుద్ధం.. గుజ‌‌‌‌రాత్‌‌‌‌కు చెందిన  ఇద్దరు మ‌‌‌‌హారాష్ట్రను దోచుకునేందుకు ప్రయ‌‌‌‌త్ని స్తున్నారు.మ‌‌‌‌హారాష్ట్ర  ప్రజ‌‌‌‌లు ఆలోచించి ఈ ఎన్నిక‌‌‌‌ల్లో మ‌‌‌‌హా వికాస్ అఘాడీకి (ఎంవీఏ) ఓటు వేయాలి’’అని కోరారు. మ‌‌‌‌హారాష్ట్రలో ఎంవీఏను గెలిపిస్తే తెలంగాణ‌‌‌‌లో అమ‌‌‌‌ల‌‌‌‌వుతున్న అన్ని హామీలు ఈ రాష్ట్రంలో అమ‌‌‌‌ల‌‌‌‌వుతాయని చెప్పారు.

ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రాధాన్యం

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళ సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం రేవంత్  రెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా ప్రజలకు ఆయన సోమవారం ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల కోసం ఇందిరమ్మ ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేశారని కొనియాడారు. పేదలు, మహిళల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తుచేశారు. 

భారతీయ శక్తికి మహిళలే ప్రతీక అన్న ఆమె మాటల స్ఫూర్తితో తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయ డం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఇందిరమ్మ జయంతి రోజే 22 జిల్లాల్లో నిర్మించబోయే ఇందిర మహిళా శక్తి భవనాలకు భూమిపూజ కార్యక్రమాలు చేయడం గర్వకారణమన్నారు. దేశ చరిత్రలో తొలిసారి 4 వేల మహిళా సంఘాలతో సౌర విద్యుత్  ప్లాంట్లు ఏర్పాటు చేయడం ప్రజాప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు.

కాంగ్రెస్​ వెంటే మహారాష్ట్ర ప్రజలు

హిమాచ‌‌‌‌ల్ ప్రదేశ్‌‌‌‌లో 95 శాతానికిపైగా హిందువులు ఉన్నారని, కానీ వారు బీజేపీకి ఓటేయలేదని,  కాంగ్రెస్‌‌‌‌వైపే ఉన్నారని తెలిపారు. మ‌‌‌‌హారాష్ట్రలోనూ ప్రజలు కాంగ్రెస్‌‌‌‌ను ఆద‌‌‌‌రిస్తారని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధాన‌‌‌‌మంత్రి అయ్యాక కార్పొరేట్ కంపెనీల అప్పులు రూ.16 ల‌‌‌‌క్షల కోట్లు మాఫీ చేశారని,  తాము రైతుల‌‌‌‌కు రుణ‌‌‌‌మాఫీ చేస్తే  బీజేపీ నేత‌‌‌‌లు ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. పేద మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌ కోసం సంక్షేమ కార్యక్రమాలు అమ‌‌‌‌లు చేసినా.. ఎందుకని ప్రశ్నిస్తున్నారని, పేద మ‌‌‌‌హిళ‌‌‌‌ల‌‌‌‌కు అందించే సంక్షేమం, స‌‌‌‌హాయం తిరిగి మార్కెట్‌‌‌‌లోకి వ‌‌‌‌స్తుందని, అది ఖ‌‌‌‌ర్చు కాదు పెట్టుబ‌‌‌‌డి అని వెల్లడించారు. 

మైనార్టీ రిజర్వేషన్లు చట్టప్రకారం పెంచాల్సి ఉంటుందని, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  కాంగ్రెస్ లో విభేదాలంటూ బీజేపీ వాట్సాప్ యూనివ‌‌‌‌ర్సిటీ త‌‌‌‌ప్పుడు ప్రచారం చేస్తున్నదని, తెలంగాణ‌‌‌‌లోనూ జూనియ‌‌‌‌ర్లు, సీనియ‌‌‌‌ర్లు అని ప్రచారం చేశారని అన్నారు. కర్నాటక, హిమాచ‌‌‌‌ల్ ప్రదేశ్‌‌‌‌లోనూ అలానే ప్రచారం చేశారని,  చివ‌‌‌‌ర‌‌‌‌కు ఏమైందని ప్రశ్నించారు.  సంక్షోభ స‌‌‌‌మ‌‌‌‌యంలోనే పార్టీలోనైనా,  దేశంలోనైనా జెండా ప‌‌‌‌ట్టుకునేందుకు నూత‌‌‌‌న నాయ‌‌‌‌క‌‌‌‌త్వం బ‌‌‌‌య‌‌‌‌ట‌‌‌‌కు వ‌‌‌‌స్తుందని, సంక్షోభం లేకుండా మీకు కొత్త నేత రారని సీఎం రేవంత్ తెలిపారు.