మతాల మధ్య చిచ్చుపెట్టి.. దేశాన్ని విభజించడమే మోదీ సిద్ధాంతం: సీఎం రేవంత్రెడ్డి

మతాల మధ్య చిచ్చుపెట్టి.. దేశాన్ని విభజించడమే మోదీ సిద్ధాంతం: సీఎం రేవంత్రెడ్డి
  • రాహుల్ అంటే మోదీకి భయం..అందుకే లోక్ సభలో మైక్ ఇవ్వలే:సీఎం రేవంత్రెడ్డి 
  • గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకిస్తూ మోదీ గాడ్సే సిద్దాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు

ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ గాడ్సే సిద్దాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దేశ యువత ఏకం కావాల్సిన టైమొచ్చిందన్నారు. యువతకు గాంధీ బాటలో నడుస్తూ.. మోదీ, గాడ్సేలను ఓడించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే ప్రధాని మోదీకి భయం..మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతడనే లోక్ సభలో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో మోదీకి, అమిత్ షాకు ఉద్యోగాలు వచ్చాయి తప్పా.. నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

నెహ్రూ నేతృత్వంలో పటేల్ నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కలిగించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ.. దేశాన్ని విభజించడమే మోదీ లక్ష్యం అందుకే తెలంగాణలో బీజేపీని, మోదీని అడుగు పెట్టనివ్వం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ గాడ్సే సిద్దాంతాలను సాగిస్తున్నారు. కాంగ్రెస్ గాంధీ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్తుంది.దేశ యువత ఏకమై మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన టైం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 

►ALSO READ | ప్రధాని మోడీ అగ్గి రాజేస్తాడు.. దానిపై RSS పెట్రోల్ పోస్తుంది: మల్లికార్జున ఖర్గే ఫైర్

దేశంలో మోదీ పాలన వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీపాలన పూర్తిగా విఫలమయ్యారు. అందుకు మణిపూర్ సంక్షోభమే నిదర్శనమన్నారు. మోదీకి అధికారం కట్టబెడితే రైతులను మోసం చేశారని విమర్శించారు. మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను వంచించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర నిర్వహించారు. యాత్రలో సందర్భంగా మహిళలు, యువత, రైతులకు అనేక హామీలు ఇచ్చారు. హామీలను నెరవేర్చేందుకు కృషి  చేస్తున్నారు. రాహుల్ గాంధీ బాటలో తెలంగాణ ప్రభుత్వం సాగుతోందన్నారు. అందులో భాగంగా రైతులకు కిచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. ఏకకాలంలో రైతులకు 2లక్షల రుణమాఫీ చేసిందన్నారు.