హైదరాబాద్:రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి.. గతంలో విశ్వ విద్యాలయాలనుంచే రాజకీయ నాయకులు వచ్చారు. ప్రజలకు సుపరిపాలన అందించారన సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థి రాజకీయాల లేకపోవడం వల్లే ఈనాటి పార్టీ ఫిరాయింపులు ఎక్కువ అవుతున్నాయి. అవినీతి పెరుగుతోందన్నారు. ప్రస్తుత చట్టసభల్లో స్పూర్తి లోపిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి.. చట్టసభల్లో అధికార పక్షమే కాదు.. ప్రతిపక్షమూ కూడా చాలా ముఖ్యమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి రాజకీయాలను ప్రోత్సహిస్తోంది.. అందుకే మేం అధికారంలోకి రాగానే విశ్వ విద్యాలయాల బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతం కొంత కాలంగా యూనివర్సిటీలను వీసీ లేకలేరు.. అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీలకు వీసీల నునియమించామన్నారు.
హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో ఆదివారం (జనవరి 12, 2025) జరిగిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీగవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసాగర రావు మచ్చలేని ఆదర్శనీయ నేత అని అన్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా ఎవరూ వేలెత్తి చూపలేదన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న నేత విద్యాసాగర్ రావు అని ప్రశంసించారు.