
హైదరాబద్: దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది.ఇలాంటి టైంలో ఉగ్రదాడులు అభివృద్దికి ఆటంకం..పహల్గాం ఉగ్రదాడికి కారకులైన వారిని ఏ ఒక్కరిని వదలకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ( ఏప్రిల్ 25) సాయంత్రం హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజానుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..ఉగ్రవాదం అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మద్దతిస్తామని తెలిపారు.
AICC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్యెల్యే లు, ఎమ్మె్ల్సీలు, మహిళ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర పహల్గాం మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘీభావంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, భారత్ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.