మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులు న్నారని.. కోటి మందిని సభ్యులుగా చేరేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీరిదిద్దాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సంఘాల కార్యకలాపాలకు, ఆ సంఘాలు చేపట్టే వ్యాపారాలకు తమ వినూత్న ఆలోచనలు కూడా జోడించాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ | రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ
మంగళవారం 2024 జూన్ 16న జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో సమావేశ మయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, ప్రభు త్వ భూములు, ధరణి సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు వంటి కీలక అంశాలపై దాదాపు 9 గంటల పాటు చర్చించారు. కలెక్టర్లు ప్రజల కుటుంబ సభ్యులుగా పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా స్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు జిల్లా కలెక్టర్లేనని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత తో పాటు , ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారు.