
- వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను మహిళా సంఘాలకు అప్పగిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఏజ్ లిమిట్ పెంచుతున్నట్లు ప్రకటించారు. 15యేళ్ల నుంచి 65 యేళ్లలోపు మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులు చేరాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ మహిళల అర్థికాభివృద్దే..రాష్ట్ర ఆర్థికాభివృద్ధి..ఇప్పటికే మహిళా సంఘాల్లో 65లక్షల మంది సభులున్నారు..కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చాలా ఈజీ అన్నారు.
మహిళల ఉన్నతికి రాష్ట్రప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 65లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు. పాఠశాలల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. స్కూల్ పిల్లల బట్టలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. మహిళలు ఇంట్లో కూర్చొని వేల రూపాయలు సంపాదించొచ్చన్నారు.
ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళశక్తి భవనాన్ని మంజూరు చేశామన్నారు.
1000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ ప్లాంట్లను మహిళలకు అప్పగించామన్నారు. ఆర్టీసీలో బస్సులను మహిళలకు లీజుకు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 600మంది బస్సులను మహిళా సంఘాలకు అప్పజెప్పాం.. రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు మహిళలను యాజమానులను చేస్తామన్నారు.