హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకు MSME2024 పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదిక లో MSME2024 పాలసీ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ.. వ్యాపార విస్తరణ మరింత సరళీకృతం చేసేందుకు ఈ పాలసీని అమలు చేయను న్నట్లు తెలిపారు. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం నడవదు.. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకే ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు.
పారిశ్రామిక విధానాలను ప్రజాప్రయోజనకరంగా ఉండేందుకు మార్పులు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాం లో తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో మార్పులే నేడు మనకు దిక్సూచి అయ్యాయన్నారు.
మనం ప్రపంచంతో పోటీపడే స్థితిలో ఉన్నామంటే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లు తీసుకొచ్చిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలే అందుకు కారణమన్నారు. ప్రపంచంతో పోటీ పదే విధంగా విధి విధానాలనతు రూపొందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ALSO READ | MSME Policy: ఎంఎస్ఎంఈ-2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఒకప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చిన్న గ్రామాలైన కొండాపూర్, మాదాపూర్ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాలు అభివృద్ధికి కారణమన్నారు. 1960లో ఊఐడీపీఎల్ ను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే స్థాపించారన్నారు. ఢిఫెన్స్, బీహెచ్ ఈఎల్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు.
కరోనా తర్వాత మూతపడిన వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంఎస్ ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మరంగంలో దూసుకుపోతోంది.. గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్ హామీలను కూడా మే నెరవేరుస్తామన్నారుసీఎం రేవంత్ రెడ్డి.