తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనే వ్యక్తి ఎక్స్‌పైరీ మెడిసిన్ అని.. ఉనికి లేకుండా చేశాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఒకే ఒక్క సంవత్సరంలో.. కొడుకు కేటీఆర్ చేతనే.. కేసీఆర్‌ను ఫినిష్ చేశామన్నారాయన.
ఇక బావతో.. బామ్మర్ధిని ఫినిష్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారాయన. ఆ తర్వాత హరీష్‌ను ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు.. ఆ రాజకీయ వ్యూహం మా దగ్గర ఉంది.. తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమే కాదు.. కేసీఆర్ ఫ్యామిలీనే కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అయ్యిందని.. తెలంగాణను దోచుకుని తిన్నారని.. లక్షల కోట్ల సంపద లూటీ చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ | తప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు పారిపోయాడు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని.. కేసీఆర్ సమాజం కల్వకుంట్ల పేటెంట్ కాదన్నారాయన. చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.