
రంజాన్ మాసం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, షబ్బీర్ అలీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి 12 నుండి ప్రారంభమయ్యాయి. ఒక నెలపాటు ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను రంజాన్ నెల అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మిక ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు.