చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్.. డీలిమిటేషన్​పై ఆల్​ పార్టీ మీటింగ్​కు హాజరు

చెన్నైకి వెళ్లిన సీఎం రేవంత్.. డీలిమిటేషన్​పై ఆల్​ పార్టీ మీటింగ్​కు హాజరు

హైదరాబాద్, వెలుగు: డీలిమిటేషన్​పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన శనివారం చెన్నైలో జరగనున్న ఆల్​పార్టీ మీటింగ్ లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం సాయంత్రం వేర్వేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. చెన్నై ఎయిర్​పోర్టులో వీరికి ఘన స్వాగతం లభించింది.  చెన్నై గిండీలోని ఐటీసీ చోళ హోటల్​లో శనివారం ఉదయం 10. 30 గంటలకు మీటింగ్​ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది. అనంతరం నేతలంతా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్​ చేపట్టి దక్షిణాదికి అన్యాయం చేయాలని మోదీ సర్కార్​ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మండిపడ్తున్నాయి. ఈ అంశంపై ఆల్​పార్టీ మీటింగ్​లో విస్తృతంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ కూడా ఈ సమావేశంలో పాల్గొననుంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు శుక్రవారం సాయంత్రం చెన్నైకి వెళ్లారు.