యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లా​ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.  క్లాస్ రూంలను పరిశీలించారు సీఎం.కాసేపు గ్రౌండ్ లో పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడారు.

ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ సర్కార్ 2024 అక్టోబర్ 21న సాయంత్రం   యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌కు శంకుస్థాపన చేయగా.. ఇవాళ 2025 ఏప్రిల్ 10న ప్రారంభించారు.  ప్రభుత్వం 50 ఎకరాల్లో ఈ స్కూల్ ను నిర్మించింది. 

తెలంగాణలోని పోలీసు, అగ్నిమాపక, ఎక్సైజ్, SPF, జైళ్లలో అమరవీరులు.. ఇతర యూనిఫాం సర్వీస్ విభాగాల పిల్లలకు  ఈ స్కూల్ లో  విద్య అందించనుంది . అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో  ఏర్పాటు చేసింది. ఫస్ట్ విడతగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రారంభించనున్నారు. స్థానికులకు15 శాతం అడ్మిషన్లు  ఇవ్వనున్నారు.