చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా చేస్తే ఊరుకోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని.. అక్రమణ చేసిన వారిపై చటపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఉప్పల్ నల్ల చెరువులో ఏర్పాటు చేసిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ALSO READ :- కాళేశ్వరం ప్రాజెక్ట్కు చేసిన నష్టాన్ని కప్పిపుచ్చి.. ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్రు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నింటిపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని... హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే ముందడుగు పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.