ట్రిలియన్ డాలర్ ఎకానమీనే తెలంగాణ లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

ట్రిలియన్ డాలర్ ఎకానమీనే తెలంగాణ లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

ట్రిలియన్ డాలర్ జీడీపీనే తెలంగాణ ధ్యేయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాదాపూర్ లో ఆమ్జెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సైట్ ఆఫీసును ప్రారంభించారు  సీఎం రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన. గ్లోబల్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయన్నారు. గతేడాది ఆగస్ట్ లో అమెరికా వెళ్లినప్పుడు అమ్జెన్ వాళ్లని కలిశామని చెప్పారు.ఇంత త్వరగా హైదరాబాద్ లో తమ సంస్థను స్థాపించినందుకు సంతోషంగా ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లోనూ అమ్జెన్ పాలుపంచుకోవాలని కోరారు రేవంత్.హైదరాబాద్ ని వరల్డ్ లోనే గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.  

గ్లోబల్ ఇన్నోవేషన్స్, ఏఐ సొల్యూషన్స్ కి  హైదరాబాద్ అడ్డా

ఆమ్జెన్ లాంటి సంస్థలు హైదరాబాద్ కి రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.   గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లకి హైదరాబాద్ క్యాపిటల్ అని అన్నారు.  లైఫ్ సైన్సెస్ కి హైదరాబాద్ హబ్ మాత్రమే కాదు.. గ్లోబల్ ఇన్నోవేషన్స్, ఏఐ సొల్యూషన్స్ కి అడ్డా అని చెప్పారు.  టాలెంట్ ఉన్న ఉద్యోగులు మనదగ్గర చాలా మంది ఉన్నారు. - భవిష్యత్ లో మరిన్ని సంస్థలు హైదరాబాద్ కి వస్తాయన్నారు.