యాదాద్రి పవర్ ప్లాంట్ వెలుగులు: యూనిట్ 2ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్

  • యూనిట్ –2 జాతికి అంకితం చేసిన సీఎం
  • బ్రాహ్మణ వెల్లెంల’ప్రారంభించిన రేవంత్
  • ఉదయ సముద్రం లిఫ్ట్ పైలాన్ ఆవిష్కరణ
  • ఎత్తిపోతల జలాలకు ముఖ్యమంత్రి  పూజలు 

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ బ్రాహ్మణ వెల్లెంల, ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పథకంలోని జలాలకు పూజలు నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పాల్గొన్నారు.

అనంతరం హుజుర్‌నగర్‌ నియోజకవర్గం సమీపంలోని దామరచర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రిపవర్ ప్లాంట్ యూనిట్‌-2  ప్లాంటును సీఎం ప్రారంభించారు. నల్గొండ మెడికల్‌ కాలేజీని ప్రారంభించి.. సాయంత్రం 5 గంటలకు నల్గొండలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో  ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  ప్రసంగించనున్నారు.

ALSO READ : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి : కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించిన మంత్రి పొన్నం

వర ప్రదాయిని ‘బ్రాహ్మణ వెల్లెంల’

నల్గొండ జిల్లాలోని నకిరేకల్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాల సాగునీరు అందించేందుకు 2007లో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడంతో సీఎం ఇవాళ ప్రారంభించారు. 

వైటీపీఎస్ ప్రారంభం

దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో టీజెన్‌కో ఆధ్వర్వంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కల్గిన ఐదు కేంద్రాలను నిర్మిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 800 మె.వా. విద్యుత్తు ఉత్పత్తి కానుంది.  2వ యూనిట్‌ ఉత్పత్తికి పూర్తి స్థాయిలో అందుబాటులో రావడంతో సీఎం దీనిని ప్రారంభించారు.