ప్రపంచ వైరస్ లకు హైదరాబాద్ వ్యాక్సిన్ విరుగుడు : సీఎం రేవంత్ రెడ్డి

జీవ వైద్య, సాంకేతిక రంగంలో హైదరాబాద్ సిటీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సిటీలో జరుగుతున్న బయో ఏషియా సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మూడు వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ నుంచి ఒక వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని.. కరోనా వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ముందుంది అన్నారు. బయో వ్యాక్సిన్ల తయారీ ద్వారా.. ప్రపంచంలో పుట్టుకొస్తున్న వైరస్ లకు.. హైదరాబాద్ వ్యాక్సిన్ విరుగుడుగా అభివర్ణించారు రేవంత్ రెడ్డి.

బయో ఏషియా వల్లే వ్యాక్సిన్ల తయారీ సాధ్యమైందని.. ఒక్క ఫార్మా రంగంలోనే కాకుండా ఐటీ, ఇండస్ట్రియల్ రంగంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా స్పష్టం చేసింది సీఎం.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే కొత్తగా 40 వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారాయన.

జర్యన్ కంపెనీ మిల్టేనీ తన రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం మంచి పరిణామం అన్నారు. కంపెనీలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించటానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ వేదికపై తెలంగాణ జీవ వైద్య రంగం అభివృద్ధికి ఈ బయో సదస్సు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ALSO READ : Fact Check : ఏప్రిల్ 19న పోలింగ్.. మే 22న కౌంటింగ్ వార్తల్లో నిజమెంత..?

 

మూడు రోజులపాటు హైదరాబాద్ లో జరిగే బయో ఏషియా సదస్సు 2024ను హైటెక్స్ లో ప్రారంభించారాయన.