డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు : సీఎం రేవంత్ రెడ్డి

పేదవాళ్ల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీనవర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు. పేదలు కష్టాలు చూసిన ఇందిరాగాంధీ ఆనాడు ఈ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇండ్లు ఇవ్వబోతున్నామని..  ఆడబిడ్డల పేరుతో ఇండ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500  డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. పేదవాడి సొంతంటి కలను సాకారం చేస్తామని తెలిపారు.   

Also Read :భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి 

 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేరుతో కేసీఆర్ పేద ప్రజలతో ఆడుకున్నాడని విమర్శించారు సీఎం రేవంత్. పేదల కలల మీద కేసీఆర్‌ ఓట్ల వ్యాపారం చేశారని ఆరోపించారు.  డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై చెప్పి్ందే చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు.  మొదటినుంచి ఖమ్మం ప్రజలు కేసీఆర్ మాయ మాటలు నమ్మలేదన్నారు.  అందుకే  2014,18,23 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు  ఒకే ఒక్క సీటు ఇచ్చారని విమర్శించారు.  జర్నలిస్టులకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.   మోదీపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు.  తెలంగాణలో ఆవాస్ యోజన పథకం కింద ఎన్ని ఇండ్లు ఇచ్చారని సీఎం ప్రశ్నించారు.