
నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎస్సీ మహిళ బంగళి దేవమ్మ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు రేవంత్. నారాయణపేట నియోజకవర్గంలో 13 గ్రామాల్లో 859 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాలు ఇచ్చారు రేవంత్.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జనవరి 26న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి రూ. 5 లక్షలు ఇవ్వనుంది ప్రభుత్వం. నాలుగేళ్లలో 20లక్షల ఇళ్లను టార్గెట్ గా పెట్టుకున్న ప్రభుత్వం తొలి విడతలో 72 వేల ఇండ్లను మంజూరు చేసింది.
ALSO READ | గుడ్ న్యూస్ : మహిళలకు ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు : సీఎం రేవంత్
మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారు పునాదులు తీసి బేస్ మెంట్ నిర్మిస్తే ఫస్ట్ ఫేజ్ అమౌంట్ రూ.1 లక్ష లబ్ధిదారుల ఖాతాలో వేయనుంది. రూ.5 లక్షలను బేస్ మెంట్ దశలో రూ.లక్ష, గోడలు కట్టిన తరువాత రూ.1. 25 లక్షలు, స్లాబ్ పూర్తయ్యాక రూ.1.75 లక్షలు, ఇల్లు పూర్తయిన తరువాత రూ.లక్షను ప్రభుత్వం లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు రిలీజ్ చేయనుంది.